పోలవరం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎటపాక మండలం గొల్లగూడెం సమీపంలో గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మహిళలు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం.. గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు చేపల వేట కోసం గోదావరి నదిలోకి వెళ్లారు. ఈ క్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకోవడంతో ఐదుగురు మహిళలు నీటిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు, సహాయక బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం. మిగిలిన వారి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు కొనసాగుతోంది.
ఘటనపై అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేశారు. మహిళల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
also read: భారత అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర.. విజయవంతమైన ‘విక్రమ్-1’ ప్రయోగం