ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న 12 ఏళ్ల బాలుడిపై మొసలి దాడి చేసింది. నది వద్ద కాళ్లు, చేతులు కడుక్కోవడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. స్థానికుల వివరాల ప్రకారం.. బాలుడు నది ఒడ్డుకు వెళ్లి నీటిలో దిగిన సమయంలో ఒక్కసారిగా మొసలి అతడిపై దాడి చేసింది. బాలుడిని నదిలోకి లాక్కెళ్లి దాడి చేయడంతో తీవ్ర విషాదం నెలకొంది.
మృతుడి తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారని, చిన్నప్పటి నుంచి బాబాయ్ సంరక్షణలోనే బాలుడు పెరిగాడని స్థానికులు తెలిపారు. బాలుడి మరణంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు, అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నది పరిసర ప్రాంతాల్లో మొసళ్ల సంచారం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
also read: మహిళపై అసభ్య ప్రవర్తన.. యువకుడిని చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు