Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ విద్యార్థులకు శుభవార్త: ఈ నెల 24లోగా తల్లుల ఖాతాల్లోకి 'తల్లికి వందనం' నిధులు!

ఏపీ విద్యార్థులకు శుభవార్త: ఈ నెల 24లోగా తల్లుల ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ నిధులు!

క్రైమ్ మిర్రర్, అమరావతి :- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 24వ తేదీలోగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ పథకం నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఈ నెల 24న ‘మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్స్’ జరగనున్నాయి. ఈ సమావేశాల కంటే ముందే, పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి రూ. 13,000 చొప్పున నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ స్కీమ్‌ అమలులో భాగంగా, తొలి విడతలో దాదాపు రూ. 10,049 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. ఈ భారీ మొత్తానికి సంబంధించిన పరిపాలనా అనుమతులు ఈరోజే వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అనుమతులు రాగానే నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం కానుంది.కొత్తగా చేరేవారికి రెండో విడతలో..పాఠశాలల్లో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులతో పాటు, కొత్తగా అడ్మిషన్లు పొందే వారికి కూడా ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా బడుల్లో చేరే విద్యార్థులకు రెండో విడతలో ‘తల్లికి వందనం’ నిధులను విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోంది.

నవంబర్ 19న ‘ఇందిరమ్మ బీమా’ ప్రారంభం.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన!

Nitin Gadkari: ఈ20 పెట్రోల్ పై అపోహలు వద్దు.. మంత్రి గడ్కరీ క్లారిటీ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు