Homeక్రైమ్ఇన్‌స్టాగ్రామ్ ప్రియురాలితో హోటల్‌లో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!

ఇన్‌స్టాగ్రామ్ ప్రియురాలితో హోటల్‌లో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య!

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువతితో భర్త హోటల్‌లో ఉండగా.. భార్య అక్కడికి చేరుకుని అతడిని పట్టుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రేవాలోని ఓ హోటల్‌లో ఆకాష్ చౌహాన్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతితో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య రాను పాండే హోటల్‌కు చేరుకుని ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని ప్రశ్నించింది.

also read: రూ.150 అప్పు.. లక్షల్లో ఖర్చు.. 45 ఏళ్ల కోర్టు పోరాటం! చివరికి తీర్పు ఇలా…

గత ఏడాది ఆకాష్, రాను ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయితే తనకు పెళ్లి కాలేదని చెప్పి మరో యువతిని నమ్మించి హోటల్‌కు తీసుకువచ్చినట్లు భార్య ఆరోపించింది. ఈ ఘటనలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆకాష్ తనకు కొత్తగా పరిచయమైన యువతితోనే జీవించాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి రాను విడాకులు ఇవ్వడానికి అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా పరిచయాలు, వివాహ బంధాల్లో నమ్మకం వంటి అంశాలపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

also read: షాబాద్ ఆరు హత్యల కేసులో కీలక మలుపు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య

తాజావార్తలు