క్రైమ్ మిర్రర్, సినిమా :- ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇమ్తియాజ్ అలీ కుటుంబంలో త్వరలో పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన కుమార్తె ఇడా అలీ తన ప్రియుడు కృష్ణ్ అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని ఇడా అలీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.జూలై 1న నార్వేలోని అందమైన యత్రెసాండ్ బీచ్ వద్ద కృష్ణ్ అగర్వాల్ ఇడాకు ఎంతో రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశారు. ఆ ప్రత్యేక క్షణాలను వీడియో రూపంలో ఇడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 01/07/26 – 11 PM, Ytresand అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో కృష్ణ్ మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేయడం, అనంతరం ఇడా తన డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.ఈ పోస్ట్‌కు సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Honey Trap Scam: న్యూడ్ వీడియో కాల్.. తర్వాత బ్లాక్‌మెయిల్.. యువ ఇంజనీర్‌కు భారీ షాక్!
ఇడా అలీ కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే సినీ రంగంలో రాణిస్తోంది. కేవలం 17 ఏళ్ల వయసులోనే లిఫ్ట్ అనే షార్ట్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించింది. అనంతరం మాయ వంటి షార్ట్ ఫిల్మ్‌లు తెరకెక్కించడంతో పాటు, అమెజాన్ మినీటీవీ కోసం ఉల్జే హువే అనే రొమాంటిక్ డ్రామాకు కథ అందించింది.సినిమాలతో పాటు యువత మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే రీఫ్రెష్ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా స్థాపించింది. కాలిఫోర్నియాలోని చాప్‌మన్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్‌లో విద్యను అభ్యసించిన ఇడా, ప్రస్తుతం పోడ్‌కాస్ట్‌లు, డిజిటల్ కంటెంట్ ద్వారా కూడా తన ప్రతిభను చాటుతోంది.మరోవైపు, కృష్ణ్ అగర్వాల్ వినోద రంగానికి చెందిన వ్యక్తి కాకపోయినా, ఇడాతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇద్దరూ తరచూ సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తూ తమ బంధాన్ని అభిమానులతో పంచుకునేవారు. ఇటీవల వారు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్, ఆమె భర్త షేన్‌తో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లిన విషయం కూడా వార్తల్లో నిలిచింది.
ఇటీవల విడుదలైన తన తాజా చిత్రం మైన్ వాపస్ ఆఊంగ్ ప్రమోషన్స్‌లో ఇమ్తియాజ్ అలీకి ఇడా పెద్ద మద్దతుగా నిలిచింది. థియేటర్ విజిట్స్ నుంచి సోషల్ మీడియా ప్రమోషన్స్ వరకు తండ్రి సినిమాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసింది.ఇప్పుడు ఇడా అలీ నిశ్చితార్థంతో ఇమ్తియాజ్ అలీ కుటుంబంలో ఆనందం నెలకొనగా, త్వరలో పెళ్లి తేదీపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆత్మహత్య చేసుకుంటానన్నారా? మాజీ సీఈసీ షాకింగ్ కామెంట్స్!