Homeక్రైమ్మెట్‌పల్లిలో మహిళ దారుణ హత్య.. పరారీలో నిందితులు

మెట్‌పల్లిలో మహిళ దారుణ హత్య.. పరారీలో నిందితులు

క్రైం మిర్రర్ : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ఓ మహిళ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న కర్రె సునీత (34) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో మెడపై దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, మెట్‌పల్లి సీఐ సురేష్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.

ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేయగా, హత్య వెనుక వ్యక్తిగత విభేదాలా, ఇతర కారణాలా అన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

also read : మల్కాపూర్ చెరువులో మునిగి.. ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు