Homeఆంధ్ర ప్రదేశ్జగన్ నమ్ముకున్నది గొడ్డలిని, సోషల్ మీడియానే అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం!

జగన్ నమ్ముకున్నది గొడ్డలిని, సోషల్ మీడియానే అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం!

క్రైమ్ మిర్రర్,అమరావతి:- వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ నమ్ముకున్నది గొడ్డలిని, సోషల్ మీడియానే అని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.’వైసీపీ చీఫ్ కుటుంబం మొత్తానిది నేరచరిత్రే. వీరివల్ల ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశ్యంతోనే జగన్ పదేపదే మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఆయనది హిట్, రన్ అండ్ ఎస్కేప్ తత్వం. ఇక్కడ నేరాలు చేయించి బెంగళూరులో దాక్కుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని, నేతలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

ఫిన్లాండ్‌లో అదృశ్యమైన తెలుగు విద్యార్థి మృతి? అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు!

ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచంలో విషాదం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు