-
మెట్రో, మూసి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ను కార్నర్ చేసే యత్నం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో క్రెడిట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మధ్య గడ్డి ఫైట్ ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి, రాజకీయ వ్యూహాలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిరంతరం డిఫెన్స్ లో పెడుతుంటారు. దానికి కౌంటర్ గా ఇప్పుడు కిషన్ రెడ్డి ఒక సరికొత్త పొలిటికల్ గేమ్ ను తెరపైకి తెచ్చారు. సింగరేణి సంస్థకు ఊపిరి పోసే విధంగా తాడిచర్ల బ్లాక్ 2 నో కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. రేవంత్ రెడ్డి వేస్తున్న మెట్రో, మూసి ప్రాజెక్టుల ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి.. తెలంగాణ అభివృద్ధికి తానే ముందుంటున్నానని మైలేజ్ కోసమే మంత్రి కిషన్ రెడ్డి సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ భిన్న స్పందన…
Also Read:సీఎం రేవంత్ వ్యూహం…!గోశాలలతో హిందూ ఓటు బ్యాంక్ పై గురి…
కిషన్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో.. ఈ కేటాయింపు పై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు మరి కొందరు మంత్రులు, ఎంపీలు సానుకూలంగా స్పందించారు. అయితే పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అసలు విషయాలు బయటకు వచ్చాయి. తాడిచర్ల 2 అనేది కిషన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా కేటాయించిన బ్లాక్ కాదని.. దీనిని 2013లోనే సింగరేణి కేటాయించారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్న లేఖల నేపథ్యంలో కేంద్రం కేవలం లీజు అనుమతిని మాత్రమే ఇప్పుడు మంజూరు చేసిందని గుర్తించారు. దానినే తానే కొత్తగా ఇచ్చినట్టు కిషన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కేనని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.
బయటపడిన ద్వంద వైఖరి…
Also Read:ఇండియన్ రైల్వే… నాన్ స్టాప్…! సోషల్ మీడియాలో వైరల్…
అయితే సింగరేణి గనుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది. తాజాగా కిషన్ రెడ్డి ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది అనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు తాడిచర్ల బ్లాక్ లీజుకు అనుమతి ఇస్తూనే.. మరోవైపు గిరిజన చట్టాల పరిధిలోకి వచ్చే కోయగూడెం 3, మణుగూరు, సత్తుపల్లి వంటి సింగరేణి పరివాహక ప్రాంతాల్లోని బొగ్గు గనులను కేంద్రం వేలంపాటలో పెట్టడం.. సింగరేణి సమస్త ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిజంగా తెలంగాణ సింగరేణి పై ప్రేమ ఉంటే.. వివాదాస్పదమైన ఈ ప్రక్రియ పై సమీక్ష జరిపి తగిన సవరణలు చేయాలే తప్ప.. పాత కేటాయింపులను కొత్తగా చూపిస్తూ క్రెడిట్ కొట్టేయాలని చూడడం సరైన చర్య కాదు అని తెలంగాణవాదులు చెబుతున్నారు.