Homeఆంధ్ర ప్రదేశ్అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

క్రైమ్ మిర్రర్, అమరావతి :- అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లో న్యాయం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.సీఐడీ (CID) జప్తు చేసిన ఆస్తుల వేలం ద్వారా వచ్చే డబ్బును బాధితులకు చెల్లిస్తామని ఉపసంఘం తెలిపింది. ఈ క్రమంలో ఏజెంట్ల నుంచి నెల రోజుల్లో బాండ్లను సేకరించాలని కూడా నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంతో దాదాపు 11.57 లక్షల మంది డిపాజిటర్ల సమస్యకు పరిష్కారం లభించనుందని సమీక్ష అనంతరం మంత్రి మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని బాధితులకు సుమారు రూ. 3,944 కోట్లు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బాధితుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

కేసీఆర్‌పై కోపంతో రైతులను శిక్షించొద్దు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు