హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: తెలంగాణ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 15 విదేశీ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లండన్ యూజీసీకి దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని వర్సిటీలు సంప్రదింపులు జరుపుతున్నాయి. ఈ విదేశీ క్యాంపస్‌ల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడంతో పాటు, మేధో వలసలు తగ్గి స్థానికంగానే ఉద్యోగ, పరిశోధన అవకాశాలు లభించనున్నాయి.ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల్లో అంతర్జాతీయంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం త్వరలోనే అంతర్జాతీయ ఉన్నత విద్యా రంగానికి కూడా గ్లోబల్ హబ్‌గా మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020తో పాటు, యూజీసీ ప్రకటించిన నూతన సడలింపులు భారత్‌లో విదేశీ వర్సిటీల ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేశాయి.
Also Read:మధ్యప్రదేశ్‌లో భయానక రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన ఇన్నోవా
ఈ అనుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుంటూ వివిధ దేశాలకు చెందిన సుమారు 15 ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి క్యూ కడుతున్నాయి. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉన్న అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, నివాసయోగ్యమైన వాతావరణం అంతర్జాతీయ సంస్థలను ఇటువైపు ఆకర్షిస్తున్నాయి.ఇప్పటికే ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, యూకేకు చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ క్యాంపస్‌ల ఏర్పాటు కోసం యూజీసీకి అధికారికంగా దరఖాస్తులు కూడా చేసుకున్నాయి. ప్రస్తుతానికి ఈ విశ్వవిద్యాలయాలన్నీ ప్రైవేట్ భాగస్వామ్యంతోనే స్వతంత్ర ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
Also Read:ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విషాదం.. ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఒక ప్రముఖ వర్సిటీ వచ్చే విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఐటీ కారిడార్ గచ్చిబౌలిలోని ఒక భారీ కమర్షియల్ టవర్‌లో కొన్ని అంతస్తులను లీజుకు తీసుకునేందుకు ప్రభుత్వ వర్గాలతో చర్చలు జరుపుతోంది. తాత్కాలికంగా ఇక్కడ ప్రారంభించి భవిష్యత్తులో ప్రయోగశాలలు, స్పోర్ట్స్ అకాడమీలతో కూడిన శాశ్వత క్యాంపస్‌ల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది.మరికొన్ని టాప్ వర్సిటీలు కూడా క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రాథమిక సంప్రదింపులు పూర్తి చేశారు.
Also Read:ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత గౌరవం.. బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో సత్కారం
అదేవిధంగా.. యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం ఇక్కడ ప్రత్యేకంగా క్రీడలు, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన స్పెషలైజ్డ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితో పాటు న్యూ కాజిల్ యూనివర్సిటీ, చిచెస్టర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ హెర్ట్‌ఫోర్డ్‌షైర్, న్యూజిలాండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వైకాటో ప్రతినిధులు కూడా విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి తమ ప్రతిపాదనలను సమర్పించారు.తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ఉన్నత చదువుల కోసం వేల సంఖ్యలో విద్యార్థులు కోట్లాది రూపాయల ధనాన్ని వెచ్చించి అమెరికా, యూకే, కెనడా వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్య ఇక్కడే అందుబాటులోకి రావడం వల్ల అక్కడకు వెళ్లే అవసరం ఉండదు.
Also Read:EV కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్!- టాటా ఎలక్ట్రిక్ కార్లపై బంపర్ ఆఫర్లు
ఈ క్యాంపస్‌ల నిర్మాణాల ద్వారా రాష్ట్రంలోకి భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రానున్నాయి. అంతేకాకుండా, బోధన, బోధనేతర రంగాల్లో, ఐటీ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో స్థానిక యువతకు వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పరిశ్రమలకు సమీపంలో ఈ క్యాంపస్‌లు ఉండటం వల్ల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ కార్పొరేట్ ప్రాజెక్టులు సులభంగా దక్కుతాయి.పరిశోధనల విషయానికొస్తే, విదేశీ వర్సిటీలు కేటాయించే భారీ రీసెర్చ్ ఫండ్స్ స్థానిక పీహెచ్‌డీ విద్యార్థులకు వరంగా మారనున్నాయి. హైదరాబాద్‌లోని ఐఐటీ, బిట్స్ పిలానీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో కలిసి ఈ గ్లోబల్ వర్సిటీలు సంయుక్త పరిశోధనలు చేపట్టే అవకాశం ఉంది.