క్రైమ్ మిర్రర్, జాతీయం:-నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 4,098 టెక్నికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మొత్తం 35 టెక్నికల్ కేటగిరీలలో ఈ నియామకాలు జరగనున్నాయి. వీటిలో జూనియర్ ఇంజనీర్లు (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్లు (DMS), కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్ తదితర ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి.
విభాగాల వారీగా చూస్తే, అత్యధికంగా పర్మనెంట్ వే విభాగంలో 845 ఖాళీలు ఉండగా, వర్క్స్‌లో 470, క్యారేజ్ & వాగన్ విభాగంలో 450 చొప్పున ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్లను వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) ఈ నెల 21వ తేదీ నుంచి జారీ చేయనున్నాయి. ఉద్యోగార్థులు తదుపరి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లను గమనిస్తూ ఉండాలని సూచించారు.
అయ్యో అయ్యర్.. తొలి విజయం ఇంకెన్నాళ్లు!
నల్లమల శాసనాల్లో అమరావతి చారిత్రక ఆనవాళ్లు: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్