క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నSIR ప్రక్రియను శుక్రవారం నాడు చండూరు ఆర్డీవో శ్రీదేవిఆర్డీవో శ్రీదేవి స్థానిక తహశీల్దార్ శ్రీనివాసులుతో కలిసి పరిశీలించారు. గ్రామంలోని 267 పోలింగ్ కేంద్రంలో SIR ఎన్యుమనరెషేన్ ఫారాల స్వీకరణ, BLO అప్లలో ఎంటర్ చేయు విధానాన్ని పరిశీలించి మాట్లాడారు. SIR లో భాగంగా BLO లు ఇంటింటికి ఇచ్చిన ఫారాలను ఓటర్లు నింపిన వెంటనే వారికీ తిరిగి అందిస్తేనే ఓటరు జాబితాలో పేర్లు వుంటాయని లేకుంటే ఓటు మెస్ ఆయె ప్రమాదం ఉంటుందని అన్నారు. మేము గతంలో ఓటు హక్కును వినియోగించుకున్నామని మా ఓటుకు ఎంజరుగుతుందిలే అని అజాగ్రత్త వహించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికి ఎన్యుమనరెషేన్ ఫారాలు అందుతాయని, వాటిని పూర్తి చేసిన వెంటనే BLO లకు తిరిగి ఇవ్వాల్సిందేనని ఆమె తెలిపారు. వారి వెంట ఆరై, గ్రామా సర్పంచ్, ఉప సర్పంచ్, బి.ఎల్.ఓ తదితరులు ఉన్నారు.