Homeఅంతర్జాతీయంబాలిక పై అత్యాచారానికి పాల్పడిన క్రికెటర్.. జీవితకాల జైలు శిక్ష విధించిన కోర్టు...!

బాలిక పై అత్యాచారానికి పాల్పడిన క్రికెటర్.. జీవితకాల జైలు శిక్ష విధించిన కోర్టు…!

Crime Mirror, Latest Updates: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన క్రికెటర్ కు జీవితకాల జైలు శిక్షను విధించింది ఆస్ట్రేలియాలోని కోర్టు. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, అసభ్యకరమైన విషయాలకు ప్రేరేపించిన కేసులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ సమ్మర్స్ దోషిగా తేలడంతో అక్కడి కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది.

ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా ది కాన్బెర్రా టైమ్స్ తాజాగా వెల్లడించింది. ఈ రెండు ఘటనలకు సంబంధించి సదరు మాజీ క్రికెటర్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో తాను దోసి అని స్వయంగా సమ్మర్సు అంగీకరించడంతో ఈ మేరకు శిక్ష పడినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ప్యాచర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సమ్మర్స్.. తాజాగా అత్యాచార కేసులో చిక్కుకొని జైలుకు వెళ్లడం సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తే.. 2018 జనవరిలో బిగ్ బాస్ లీగ్ (బిబిఎల్) లో హోబార్డ్ హరికెన్స్ జట్టుకు అరుణ్ సమ్మర్సు ప్రాతినిధ్యం వహించాడు.

ఆ సమయంలో సోషల్ మీడియా ద్వారా 15 ఏళ్ల బాలికతో అతడు పరిశీలించుకున్నాడు. అనంతరం స్థానిక పాఠశాల ప్రాంగణంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికపై లైంగిక దాడి చేయడంతో పాటు అసభ్యకరమైన విషయాలకు ప్రేరేపించే ఉద్దేశంతో గ్రూమింగ్ చేసిన రెండు ప్రధాన ఆరోపణలను కోర్టులో సమ్మర్స్ అంగీకరించాడు. దీంతో కోర్టు అతడికి జీవితకాల జైలు శిక్షణ విధిస్తూ తీర్పును ఇచ్చింది.

  • తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒంటరితనంతోనే సమస్య..

ఈ కేసులో సమ్మర్స్ తరపున న్యాయవాది కరో లైన్ గ్రేవ్స్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కోర్టుకు సదరు లాయర్ కీలకమైన అంశాలను వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో సమ్మర్సు తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒంటరితనం ఎదుర్కొంటున్నట్లు లాయర్ కోర్టుకు తెలియజేశారు.

సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వలన తప్పుదారిలో నడిచినట్లు వివరించారు. ఈ సంఘటన సమ్మర్సను జీవితాంతం వెంటాడుతుందన్న ఆయన.. అయినప్పటికీ అతడు తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇకపై ఈ తరహా నేరాలకు పాల్పడడని హామీ ఇవ్వడంతో పాటు.. 2018లో సమ్మర్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఫెసర్ అని, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి అని కోర్టుకు వివరించారు.

ఈ వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ మేరకు శిక్ష విధించింది. ఇకపోతే అరుణ్ సమ్మర్సుకు ఎలాంటి కేసులు కొత్తవి కావని తెలుస్తోంది. 2021 లో కూడా పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు కలిగి ఉండటం, వాటిని ఇతరులకు పంపించడం వంటి కేసుల్లోనూ దోషిగా ఉన్నాడు. ఆ కేసులో ఇప్పటికే కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించినట్లు తెలుస్తోంది.

ఈసారి శిక్షణ తగ్గించాలని సమ్మర్ష తరఫు న్యాయవాది కోర్టును కోరినప్పటికీ న్యాయమూర్తి ఆ అభ్యర్థనను గత కేసులను పరిగణలోకి తీసుకొని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సమ్మర్స్ ను మళ్లీ జ్యుడీషియల్ కస్టడీలోకి కోర్టు పంపించింది. 30 ఏళ్ల ఆరోన్ సమ్మర్స్ ఆస్ట్రేలియా దేశ వాలే క్రికెట్లో టాస్ మానియా తరఫున ఆడాడు.

బిగ్ బాస్ లీగ్ లో హోబర్ హారికెన్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరఫున రెండు మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడని భావించిన అతిధి కెరియర్ వరుసలైంగిక నేరాలతో క్లోజ్ అయ్యే స్థితికి చేరుకుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు