Crime Mirror, Latest Updates: ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. గడచిన కొన్నాళ్ళుగా ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. దీంతో ఇరుదేశాలకు చెందిన ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఒకానొక దశలో ఇరుదేశాల మధ్య యుద్ధం ముగిస్తుందని అంతా భావించారు.
ఈ తరుణంలో ఉక్రేయన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా తీవ్రస్థాయిలో దాడులకు తెగబడింది. డ్రోన్లు, క్షిపణులతో కీవ్ నగరంపై రష్యా విరుచుకు పడింది. దీంతో ఒక్కసారిగా ఉక్రెయిన్ ప్రజలు భయాందోళన చెందారు. కొద్దిరోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న నగరంలో మరోసారి దాడులు చెలరేగడంతో ప్రజలు ఆందోళన చెందారు.
రష్యా జరిపిన ఈ డ్రోన్, క్షిపణి దాడుల్లో 20 మంది పౌరులు చనిపోవడంతో పాటు మరో తంబి మందికిపైగా పౌరులు గాయపడినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ తమ చమురు శుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులకు తెగబడినట్లు రష్యా స్పష్టం చేసింది. 24 బాలిస్టిక్ రకం సహా మొత్తంగా 74 క్షిపణులను, 496 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వాయిసేన వెల్లడించింది.
ఏకధాటిగా 11 గంటల పాటు రష్యా డ్రోన్లు, క్షిపణ దాడుల కారణంగా కీయునగరంలో పేలుళ్లు మోత మోగిపోయింది. అధికారులు ముందస్తు హెచ్చరికలతో స్థానికులు చాలా వరకు సబ్వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణ నష్టం తగ్గినట్లు కేయూ నగర మేయర్ విటాలి క్లిస్కో వెల్లడించారు.
నగరంలో సుబ్బారావు ముప్పిచోట్ల భారీ నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. 20 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు, కొన్ని ప్రాంతాల్లో బహుళ అంతస్తులు భవనాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
-
మెరుపు దాడులకు పాల్పడుతున్న ఉక్రెయిన్..
ఉక్రెయిన్ 40 రోజుల నుంచి మెరుపు దాడి ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల రష్యాలో తీవ్ర ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రతీకార దాడులు చేయాలని నిర్ణయంలో భాగంగానే తాజాగా రష్యా ఈ తరహా దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘ శ్రేణి ఆయుధాలు, డ్రోన్లను రష్యా వినియోగించినట్లు ఆ దేశ అధికారులు చెబుతున్నారు. రష్యా తాజాగా చేపట్టిన దాడుల్లో 16 అంతస్తులు భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాడుల అనంతరం సహాయక బృందాలు, భావనాల శిథిలాల్లో బాధ్యతల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
రానున్న రోజుల్లోనూ రష్యా ఈ తరహా దాడులను మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని నిపుణుల పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ చేపట్టిన దాడులు వల్ల రష్యాలో ఇబ్బందుకర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ తరహా దాడులను తీవ్రతరం చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజులు డ్రోన్లు, క్షిపణులతో భారీ ఎత్తున మిగిలిన నగరాల్లో కూడా దాడులకు రష్యా ప్రణాళికలు రచించినట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.