Homeఆంధ్ర ప్రదేశ్ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు...యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్...!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు…యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్…!

మచిలీపట్నం, క్రైమ్‌మిర్ర‌ర్‌: రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నాయకులు అందించిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుని మచిలీపట్నం సమీపంలోని ఇనకుదురు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఇనకుదురు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read:ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు…యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్…!

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్టేషన్ గేట్లను మూసివేసి, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్‌చార్జి ఉడుముల బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:సినిమా కోసం ఎంతో శ్రమించా: హీరో విరాట్ కర్ణ- ‘నాగబంధం’పై భారీ నమ్మకం.. డూప్ లేకుండా యాక్షన్ సీన్లు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు