Homeలైఫ్ స్టైల్మానసిక ఒత్తిడితో సంతాన లోపం: వైద్యుల హెచ్చరిక

మానసిక ఒత్తిడితో సంతాన లోపం: వైద్యుల హెచ్చరిక

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి అనేది చాలా సాధారణ విషయంగా మారిపోయింది. అయితే, ఈ ఒత్తిడి శృతి మించితే తీవ్రమైన సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

వీర్యకణాలపై తీవ్ర ప్రభావం:- ఒత్తిడి పెరిగే కొద్దీ పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని, అలాగే వాటి కదలికలు కూడా మందగిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఒత్తిడికి తోడు నిద్రలేమి, క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు తోడైతే వీర్యకణాల నాణ్యత మరింత దెబ్బతింటుందని వారు వివరిస్తున్నారు.

నివారణకు మార్గాలు:-సంతాన లోపం సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.శరీరానికి సరిపడా నిద్ర పోవాలి.ఎత్తుకు తగ్గ ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి.సరైన ఆహారపు అలవాట్లను పాటించాలి.ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీరం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని, సంతాన సాఫల్య అవకాశాలు మెరుగుపడతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.

  1. కొడుకు దేవాన్ష్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

  2. Honey Rose Row: కేసు నమోదయ్యాక మారిన స్వరం.. హనీ రోజ్‌కు సారీ చెప్పిన వ్యాపారవేత్త!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు