Homeతెలంగాణపెద్ద‌పులి క‌ల‌క‌లం...!భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు...

పెద్ద‌పులి క‌ల‌క‌లం…!భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు…

కొత్త‌గూడెం, క్రైమ్‌మిర్ర‌ర్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికంగా అల‌జ‌డి సృష్టించింది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో పెద్దపులి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ శివారులో సంచరించిన పులి ఓ ఎద్దుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. గ్రామ సమీపంలో మేత మేస్తున్న పశువుల వద్దకు వచ్చిన పెద్దపులి ఎద్దుపై దాడికి యత్నించింది. అయితే పశువుల కదలికలు, గ్రామస్థుల అప్రమత్తత కారణంగా పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన అనంతరం గ్రామ ప్రజలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Also Read:మహారాష్ట్ర టెట్‌ పై కీలక నిర్ణయం! హిజాబ్ అనుమతికి ఒకే కానీ… ఇలా చేయక తప్పదు…

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి సంచారాన్ని నిర్ధారించేందుకు పాదముద్రల ఆధారంగా అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పులి వెళ్లిన దిశను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా అడవి ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పశువులకు రక్షణ కల్పించాలని, పులి కదలికలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Also Read:Telangana Rains: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం!

తాజావార్తలు