క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రోజు అంతా హైడ్రామా నడిచింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు టిడిపి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి సైతం సవాల్ విసిరారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు తాడిపత్రి పట్టణాన్ని మోహరించారు. దీంతో హై టెన్షన్ నెలకొంది.
ధర్నాకు సిద్ధం…
Also Read:వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ గురించి WHO కీలక సూచనలు…!
తాడిపత్రిలో వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి.. వాటికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ఉదయం స్థానిక గాంధీ బొమ్మ దగ్గర ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే దీనికి అనుమతులను నిరాకరించారు పోలీసులు. అయినప్పటికీ ధర్నా చేసి తీరుతానని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులను సమీకరించారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎలా అడుగుపెడతాడో చూస్తానని సవాల్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాలను శాంతి పరిచే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
జెసి హెచ్చరిక…
Also Read:సమంతను మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే…! దర్శకుడు రాజ్ నిడిమోరు…
అయితే పోలీస్ చర్యలతో పాటు పెద్దారెడ్డి వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుపట్టారు జెసి ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డిని అరెస్టు చేయకుండా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి బయటకు వస్తే తన ప్రతాపం చూపిస్తానంటూ సవాల్ చేశారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి కార్యకర్తలను హత్య చేశారని.. కాళ్లు చేతులు విరగ్గొట్టారని.. అప్పుడు ఇదే పెద్దారెడ్డి ఏం చేశాడని ప్రశ్నించారు. ముందుగా టిడిపి కార్యకర్తలకు, వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పి లేంపలు వేసుకోవాలని సూచించారు. తాడిపత్రిలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు
Also Read:తస్మాస్ జాగ్రత్త…. ఫ్రీ AC యోజన పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ…!