క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం దాటుతోంది. కానీ ఇంకా విభజన సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఢిల్లీలో ఏపీ భవన్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ భవన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్ల రూపాయల కేటాయించింది. దానికి సంబంధించిన లెక్కలను ఇప్పుడు అడుగుతోంది. అయితే ఈ తెలంగాణ భవన్ విషయంలో గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గులాబీ పార్టీ హయాంలో అట్టహాసంగా ప్రారంభం అయిన తెలంగాణ భవన్ నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు కేంద్రం ఖర్చు వివరాలు అడుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.
Also Read:Healthy Snacks: ఆఫీస్‌లో రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే.. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తప్పక తినండి…!
కెసిఆర్ హయాంలో…
రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు, కీలక అధికారులు ఢిల్లీ వెళ్తే.. అక్కడ ఉండేందుకు.. కార్యకలాపాలు నిర్వహించేందుకు కీలకమైన తెలంగాణ భవన్ కు శ్రీకారం చుట్టారు కెసిఆర్. తన రెండో విడత పాలనలో ఢిల్లీలోని పట్టవుడి రోడ్డులో దీనికి శంకుస్థాపన చేశారు. 8 అంతస్తులతో ఈ భవనం నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. 200 కార్లు, 500 బైకుల పార్కింగ్ సామర్థ్యంతో నిర్మించాలని ప్రణాళిక వేశారు. దీని నిర్మాణ బాధ్యతను ఎల్ అండ్ టీ కి అప్పట్లో అప్పగించారు. నాలుగు సంవత్సరాల్లో ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ వరదలతో పాటు విపత్తులకు తట్టుకునే విధంగా అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే 2023లో గులాబీ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణం గురించి పట్టించుకోలేదు. అప్పటినుంచి అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి.
కేంద్ర హోం శాఖ ఆదేశాలు…
Also Read:సమంతను మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చింది నేనే…! దర్శకుడు రాజ్ నిడిమోరు…
తాజాగా ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది కేంద్ర హోం శాఖ. ఈ భవన నిర్మాణానికి ఇప్పటివరకు ఇచ్చిన 300 కోట్ల రూపాయల లెక్కలు చెప్పాలని.. నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ అధికారులను హోంశాఖ వర్గాలు కోరినట్లు సమాచారం. కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. ప్రస్తుతానికి ఏపీ భవన్ లోనే తెలంగాణ అధికారులు ఒక భాగాన్ని వినియోగించుకుంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చినప్పుడు ఏపీ భవన్ వైపు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు తెలంగాణ భవన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చెప్పాల్సి ఉంటుంది కేంద్రానికి.
Also Read:తస్మాస్ జాగ్రత్త…. ఫ్రీ AC యోజన పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ…!