Homeజాతీయంపశ్చిమ బెంగాల్‌ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు.. పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం!!

పశ్చిమ బెంగాల్‌ సీఎంపై టీఎంసీ ఎంపీ ప్రశంసలు.. పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం!!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : పశ్చిమ సీఎం సువేందు అదికారిపై తృణమూల్‌ ఎంపీ, మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరుగాంచిన ఎంపీ మహూవా ప్రశంసలు కురిపించారు. కీలక సందర్భంలో తనకు అండా నిలిచారంటూ ఆయనను ప్రశంసించారు. తాజా వ్యాఖ్యలతో ఆమె పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రెబల్‌ గ్రూపులుగా ఏర్పడిన విషయం తెలిసిందే. తమనే అసలైన టీఎంసీ పార్టీ గుర్తించాలంటూ స్పీకర్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేఖ రాయగా.. వారికి అనుకూలంగానే నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా ముద్రపడిన ఎంపీ మహువా మొయిత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం సువేందు అదికారిని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

తాజాగా ఆమె ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్టీలు గురించి పక్కన పెడితే సువేందు అదికారితో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. టీఎంసీలో ఉన్న సమయంలో అనేక విషయాల్లో ఆయన తనకు మద్ధతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధానంగా 2014 ఎన్నికల్లో తనకు లోక్‌సభ టికెట్‌ దక్కనప్పుడు తాను ఎంతో బాధపడ్డానన్న మొయిత్రా.. రోజంతా ఏడ్చిన విషయాన్ని వెల్లడించారు. ఆ సమయంలో సువేంద తనకు ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత 2016 బంఎగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తనకు మద్ధతుగా నిలిచినట్టు తెలిపారు. అయితే, సువేందు బీజేపీలో చేరిన తరువాత ఇప్పటి వరకు కలవలేదన్నారు. కానీ, ఆయన చేసిన సాయాన్ని తానెప్పటికీ మర్చపోలేనని స్పష్టం చేశారు. టీఎంసీ విషయంలో మమతా బెనర్జీ చేయలేని పనిని సువేందు చేశారని కొనియాడారు. పార్టీ పట్ల నిబద్ధత లేని నేతలు ఎవరో ఆయన వల్లే తనకు తెలిసిందన్నారు. ఇందుకు ఆయనకు తాను కృతజ్ఞతలు చెబుతున్నట్టు వెల్లడించారు. సొంతంగా గెలిచే సామర్థ్యం లేని నేతలను టీఎంసీలో చేర్చుకోవడం వల్లే పార్టీ ఈ స్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు.

పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా ఆమె సీఎం సువేందు అదికారిని ప్రశంసిస్తూ వ్యాఖ్యానించడంతో ఎంపీ కూడా పార్టీ మారతారన్న చర్చ జోరుగా సాగుతోంది. కొద్దిరోజులు కిందట రెబల్‌ ఎంపీలు రాసిన లేఖలో ఆమె సంతకం లేదు. కానీ, తాజాగా సీఎంపై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి దీనిపై అటు సీఎం సువేందు అదికారి గానీ, ఇటు మాజీ సీఎం మమతా బెనర్జీ గానీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇదిలా, ఉంటే తాజాగా ఎంపీ వ్యాఖ్యలు ఆమె పార్టీ మార్పు యోచనకు అద్దం పడుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే పార్టీ మారిన కొందరు ఎంపీలు.. మరికొందరు ఎంపీలు తమ బాటలోనే పయనిస్తారంటూ చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఎంపీ ఈ మేరకు కామెంట్‌ చేసినట్టు పేర్కొంటున్నారు. మరి చూడాలి ఈ ఎంపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు