క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ఐదేళ్లలోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా ఉండే 29,873 పోలియో కేంద్రాలతో పాటుగా, అదనంగా మరో 1,144 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి 1,757 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, 1.31 లక్షల మందికి పైగా వైద్య సిబ్బందిని ప్రభుత్వం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే 68.67 లక్షల పోలియో వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకోగా, వాటిని అన్ని జిల్లాలకు అవసరమైన మేర పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.తల్లిదండ్రులందరూ తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వైద్యశాఖ కోరింది.
ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా గుడ్‌బై? ట్రేడింగ్‌పై కన్నేసిన కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్!
Alia vs Sharvari: ఆలియా భట్ vs శార్వరీ.. బాలీవుడ్లో మళ్లీ నెపోటిజం చర్చ!