క్రైమ్ మిర్రర్:- అయోధ్య రామాలయంలో కానుకలు, నిధులు దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించింది. దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతోపాటు దోషులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే యూపీ ప్రభుత్వం మొత్తం వ్యవహారంపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. కొద్దిరోజులు నుంచి విచారణ చేస్తున్న సిట్.. తాజాగా ప్రభుత్వానికి తమ ప్రాథమిక నివేదికను అందించినట్టు తెలుస్తోంది. అవకతవకలకు బాధ్యులైన వారిని గుర్తించిన సిట్.. అందుకు సంబంధించిన సమాచారాన్ని నివేదిక రూపంలో సీఎంకు అందించింది. దేవాలయ ట్రస్టులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారెవరూ సిట్ జాబితాలో లేరని చెబుతున్నారు. సిట్ ఈ విచారణలో భాగంగా సుమారు 150 మంది అనుమానితులను ప్రశ్నించింది. ఆరు రోజులపాటు దర్యాప్తు సాగించిన సిట్ బృందం కీలక ఆధారాలను సేకరించింది. ఈ క్రమంలోనే సిట్ దృష్టికి వచ్చిన అనేక విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అందుకు బాధ్యుతలైన వారిని విచారించి ఈ నివేదికను సమర్పించించింది. కానుకలు, నిధులు దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ జూన్ 13న ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు సంస్థను నియమించగా.. ఆ సంస్థ కీలక ఆధారాలను సేకరించి ప్రాథమిక నివేదికను సమర్పించింది.
యాక్షన్ షూరూ చేయనున్న సీఎం యోగి..
డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ ఎస్ కిరణ్, ఆర్థికశాఖ ప్రత్యేక సెక్రరటీ నీల్ రతన్ సభ్యులుగా ఉన్న సిట్ కమిటీ.. ప్రాథమికంగా అందించిన నివేదిక ప్రకారం ముఖ్య వ్యక్తులు పాత్ర ఉన్నట్టు చెబుతున్నారు. తొలుత ప్రాథమిక నివేదకను ఇప్పటికే సమర్పించిన ఈ కమిటీ.. ఆ తరువాత వీలైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రస్టు, దేవాలయం అధికారులు అయోధ్యను వీడవద్దని సిట్ అంతకుముందు ఆదేశాలను జారీ చేసింది. విరాళాలకు సంబంధించిన రికార్డుల్లో తేడాలు కనిపించిన నేపథ్యంలో ఈ చర్యలను తీసుకుంది. విరాళాలు నిర్వహనకు సంబంధించి కొందరు ట్రస్టు సిబ్బంది ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేనట్టు సిట్ పేర్కొంది. మొత్తంగా ప్రాథమికంగా గుర్తించిన అంశాలు ఆధారంగా నివేదికను సిట్ అందించింది. ఇందులో కీలకంగా ఉన్న వారిపై సీఎం యోగి ఆధిత్యనాథ్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై సీఎం. యోగీ యాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకంది.