Homeతెలంగాణపల్లెల్లోనే మతిమరుపు ముప్పు ఎక్కువ: తాజా అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెల్లడి

పల్లెల్లోనే మతిమరుపు ముప్పు ఎక్కువ: తాజా అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెల్లడి

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణలోని పల్లెటూళ్లలో నివసించే వారిలో మతిమరుపు (డిమెన్షియా) ముప్పు తీవ్రంగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జాతీయ పోషకాహార సంస్థ (NIN) సంయుక్త పరిశోధనలో వెల్లడైంది. పట్టణ వాసులతో పోలిస్తే గ్రామీణ ప్రజలకే ఈ ప్రమాదం రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

గ్రామీణుల్లోనే అత్యధికం:-తాజా అధ్యయనం ప్రకారం.. పట్టణ ప్రాంత ప్రజల్లో మతిమరుపు వచ్చే ప్రమాదం 27 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఏకంగా 60 శాతంగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పల్లెల్లో రోజూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవడం, పండ్లు, కూరగాయల వాడకం తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అత్యవసరమైన విటమిన్ B2, విటమిన్ D వంటివి తగిన మోతాదులో అందడం లేదు. శరీరంలో ఈ కీలకమైన పోషకాల లోపం ఏర్పడటం వల్లే మెదడు చురుకుదనం క్రమంగా తగ్గి, అది మతిమరుపునకు దారి తీస్తుందని ఈ అధ్యయనం తీవ్రంగా హెచ్చరించింది. కాబట్టి రోజువారీ ఆహారంలో వైవిధ్యం పాటిస్తూ, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ ముప్పును ముందుగానే అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

76 ఏళ్ల వయసులో ‘బాబా’కు పోటీగా ‘సీఎం బాబు’ ఆసనాలు..!

సాయి కృష్ణ హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు సిట్ ఏర్పాటు.!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు