Homeఆంధ్ర ప్రదేశ్వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా.. ఇకపై నేరుగా ప్రజలతోనే నా అభిప్రాయాలు: డిప్యూటీ సీఎం

వైసీపీ గూండాలను తొక్కి నార తీస్తా.. ఇకపై నేరుగా ప్రజలతోనే నా అభిప్రాయాలు: డిప్యూటీ సీఎం

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ (YCP) శ్రేణులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడలో నిర్వహించిన ‘మన ఊరు-మాట మంతి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రంలో శాంతిభద్రతల (లా అండ్ ఆర్డర్) అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తన పరిధి కాదని మౌనంగా ఉన్న తాను, ఇకపై ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.ఇక నుంచి మౌనంగా ఉండను..ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. “లా అండ్ ఆర్డర్ నా శాఖ కాదని ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. కానీ, ఇక నుంచి ఏమాత్రం ఊరుకోను,” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాష్ట్ర వ్యవహారాలు, శాంతిభద్రతలపై భవిష్యత్తులో తన అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా చెప్పబోనని, నేరుగా ప్రజలతోనే పంచుకుంటానని ఆయన కీలక ప్రకటన చేశారు.ఆన్ కెమెరా వార్నింగ్..వైసీపీ గూండాలను ఉద్దేశించి ఆయన ఆన్ కెమెరాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “YCP గుండాలకు ఆన్ కెమెరా చెప్తున్నా.. ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని తొక్కి నార తీస్తా. నా కఠిన వైఖరి ఏంటో ఇకపై చూపిస్తా,” అని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!

కామంతో కళ్లు మూసుకుపోయి.. బరి తెగించింది..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు