Homeసినిమాకూతురు క్లింకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్.. ఎంత ముద్దుగా ఉందో..

కూతురు క్లింకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్.. ఎంత ముద్దుగా ఉందో..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల ముఖాన్ని చూడాలని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలబ్రిటీల పిల్లల ప్రైవసీని కాపాడాలనే ఉద్దేశంతో చరణ్ దంపతులు ఇప్పటివరకు క్లీంకార ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు క్లింకార పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్, ఉపాసన కలిసి తమ ఫ్యామిలీ ఫోటోను సోషళ్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అందులో క్లింకార తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ కనిపించింది. ఇదిలా ఉంటే.. గతంలో బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లీంకారపై ఎలాంటి పబ్లిక్ ఒత్తిడి ఉండకూడదని, తను ఎప్పుడైతే సొంతంగా ‘నాన్నా’ అని పిలుస్తుందో అప్పుడే అధికారికంగా ప్రపంచానికి చూపిస్తానని సరదాగా చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత తిరుమల శ్రీవారి దర్శన సమయంలో మెగా ప్రిన్సెస్ ఫోటోస్ నెట్టింట వైరల్ అయినప్పటికీ ఫేస్ మాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఉపాసన. ఇక ఇప్పుడు తమ చిన్నారి ఫోటోను స్వయంగా నెట్టింట షేర్ చేశారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. చిన్నారి క్లీంకార చాలా ముద్దుగా, క్యూట్‌గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట పండగ చేసుకుంటున్నారు. “అచ్చం అమ్మ ఉపాసనలాగే ఉంది”, “మెగా ప్రిన్సెస్ సూపర్ క్యూట్” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు