Homeజాతీయంమూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్!!

మూసీకి కొత్త జీవం.. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కలల ప్రాజెక్టు అయిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిపాదనలు చేసింది. అయితే అక్కడ రక్షణ శాఖ భూములు ఉండటంతో.. సందిగ్ధత నెలకొంది. దీనికి సంబంధించి.. రక్షణ శాఖ భూములను బదలాయింపు కోసం తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర రక్షణ శాఖకు విజ్ఞప్తి చేయగా.. తాజాగా దానికి అనుమతులు మంజూరు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు, రక్షణ శాఖకు, భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌‌లోని మూసీ నది ఒడ్డున బాపూ ఘాట్‌ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. తాజాగా దానికి కేంద్ర రక్షణ శాఖ నుంచి అనుమతి మంజూరు అయ్యాయి.

మూసీ ప్రాజెక్టుకు 83 ఎకరాల రక్షణ శాఖ భూముల్లో ఆమోదం కల్పించింది. గోల్కొండ ఆర్టిలరీ పరిధిలో ఉన్న రూ.533 కోట్ల విలువైన భూములను బదలాయించేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్వీట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం.. హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పనులను నిర్వహించడానికి అనుమతి మంజూరు చేసినందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ, ఇండియన్ ఆర్మీకి సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది. మూసీ నది సమగ్ర పునరుజ్జీవనం, దాని తీర ప్రాంతాన్ని హైదరాబాద్ నగర ప్రజల కోసం ఒక శక్తివంతమైన పర్యావరణ, సాంస్కృతిక, ప్రజల ఆస్తిగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం ఇచ్చిన ఈ అనుమతి ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ, భారత సైన్యం అందించిన సహకారం, మద్దతుకు తాము కృతజ్ఞులమై ఉన్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు