Homeవైరల్ETV Prabhakar Daughter: వెండితెర పైకి ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ఎంట్రీ.. ఫోటోలు వైరల్...!

ETV Prabhakar Daughter: వెండితెర పైకి ఈటీవీ ప్రభాకర్ కూతురు దివిజ ఎంట్రీ.. ఫోటోలు వైరల్…!

Crime Mirror, Cinema Updates: ప్రముఖ బుల్లితెర నటుడు, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతున్నారు. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న వెంకట్రామయ్య గారి తాలూకా చిత్రంలో ఆమె కథానాయికగా నటించారు.

సతీష్ ఆవాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు. అన్ని నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: టాలీవుడ్‌లో మళ్లీ మురారి బ్యూటీ సందడి…! – Crime Mirror

ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ వెంకట్రామయ్య గారి తాలూకా చిత్రంలో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కోమలి మాట్లాడుతూ, ఫోక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత ఒక మంచి సినిమాను నిర్మించాలన్న కలతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు. సినిమా నిర్మాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పూర్తి చేశామని, జూలైలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

దర్శకుడు సతీష్ ఆవాల కథ గురించి మాట్లాడుతూ, ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే హృద్యమైన కుటుంబ కథ అని వివరించారు. నేటి సమాజంలో మానవ సంబంధాలు డబ్బు చుట్టూ తిరుగుతున్న పరిస్థితులను, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని, కుటుంబ విలువలను ఈ సినిమాలో భావోద్వేగంగా చూపించామని తెలిపారు. పిల్లలను ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రులను చివరి దశలో పట్టించుకోని పరిస్థితులను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించామని చెప్పారు.

Also Read: రోడ్డు ప్ర‌మాదాల‌కు చెక్‌…! దేశంలో వీటువీ టెక్నాల‌జీ… – Crime Mirror

ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కాశీ విశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూ ముంజెటి, హాసిని, యామిని తదితరులు కీలక పాత్రలు పోషించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. బి. అనిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా దర్శకుడు సతీష్ ఆవాలే సమకూర్చారు.

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారో చూడాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఆమె తొలి అడుగు కావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

Also Read: టెలిగ్రామ్‌కు మరో ఎదురుదెబ్బ.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు! – Crime Mirror

Also Read: పెళ్లిపై రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు: ‘సమాజం పెట్టిన రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు! – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు