క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు విరాళాలు, కానుకలు అందజేస్తుంటారు. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. టీటీడీ ఈ ట్రస్టుల ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే పేదలకు అవసరమైన వైద్య సాయం కూడా అందిస్తున్నారు. ఇటీవల కాలంలో టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు భక్తుల నుంచి భారీగా విరాళాలు వస్తున్నాయి. గత రెండేళ్లలో టీటీడీ ట్రస్టులకు రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. తాజాగా మరో వ్యాపార సంస్థ భారీ విరాళం అందించారు. తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి భారీ విరాళం అందజేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను అధికారులు అభినందించారు. పేద, అవసరమైన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. సమాజ సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ గతేడాది కూడా రూ.కోటి విరాళం అందించారు.
తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం.. హైదరాబాద్‌కు చెందిన సంస్థ రూ.1 కోటి విరాళం!!
By Crime Mirror
0
18
Previous article