Homeఆంధ్ర ప్రదేశ్క‌డ‌ప క్రికెట్ స్టేడియం వైర‌ల్‌...! ఏంటి ప్ర‌త్యేక‌త‌లు...

క‌డ‌ప క్రికెట్ స్టేడియం వైర‌ల్‌…! ఏంటి ప్ర‌త్యేక‌త‌లు…

కడప, క్రైమ్‌మిర్ర‌ర్‌: కడప క్రికెట్ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాత్రి సమయంలో తీసిన కడప స్టేడియం ఏరియల్ వ్యూ వీడియో కూడా ఆకట్టుకుంటోంది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కడంతో.. కడప స్టేడియం గురించి అందరికీ తెలిసింది. ఇది దేశంలోనే అత్యంత అందమైన క్రికెట్ స్టేడియాల్లో ఒకటి అని చెబుతున్నారు. ఇంకా డెవలప్ చేసి, ఎక్కువ మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి వీలుగా స్టేడియం కెపాసిటీని పెంచితే.. ఇక్కడ టెస్టులు, వన్డేలు నిర్వహించొచ్చని సూచిస్తున్నారు.‘ఎప్పుడు ఈ రూట్లోనే వెళ్తుంటా.. కానీ ఈ స్టేడియం ఇంత బాగుంటుందని నాకు తెలీదు. ఏరియల్ వ్యూ చాలా బాగుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ స్టేడియం పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుందని.. రైల్లో వెళ్తున్నప్పుడు ఈ ప్రదేశాన్ని చూడటం భలే ఉంటుందని మరో నెటిజన్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

Also Read:Custodial Death: కస్టోడియల్ మరణాలపై హైకోర్టు సీరియస్.. పోలీసులకు షాక్!

అంతా బాగానే ఉంది కానీ.. వేసవిలో ఏపీలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో కడప ఒకటి. ఎండా కాలం ఇక్కడ 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, అదొక్కటే కొంచెం ఇబ్బంది అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.క్రికెట్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఎక్స్ ద్వారా అందించే జాన్స్ అనే వ్యక్తి ‘ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వేదిక – కడప’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఫొటోకు కొద్ది గంటల్లోనే 10 వేలకుపైగా లైకులు వచ్చాయి.ఈ క్రికెట్ స్టేడియం కడప నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోని పుట్లంపల్లె ఏరియాలో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ స్టేడియం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ స్టేడియం నిర్మాణానికి వైఎస్ ఫ్యామిలీ రూ. 50 లక్షలు విరాళం ఇచ్చిందని చెబుతారు. ఈ స్టేడియంను ఇటీవలే ఆధునికీకరించారు.

Also Read:Gang Rape Case: మహిళపై కిరాతకం.. మర్మాంగంలోకి ఆ వస్తువులను పెట్టి మరీ పైశాచికత్వం!

కడప క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కలిసి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కోసం కావాల్సిన వసతులను సిద్ధం చేశాయి. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ స్టేడియాన్ని జూన్ 17న ప్రారంభించారు.ప్రస్తుతం ఈ స్టేడియంలో 15 వేల మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్‌ను వీక్షించొచ్చు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు నిర్వహించేలా 85 గజాల బౌండరీ లైన్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పిచ్‌లను రూపొందించారు. ఇక్కడ ఒక రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీ కూడా ఉంది.ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) విషయానికి వస్తే.. జూన్ 9న ప్రారంభమైన ఈ టోర్నీ ఈ నెలాఖరు వరకు జరగనుంది. మొదటి 11 మ్యాచ్‌లను విశాఖపట్నంలో నిర్వహించగా.. జూన్ 17-21 తేదీల మధ్య కడప స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. జూన్ 24-30 తేదీల మధ్య లీగ్ మ్యాచ్‌లతోపాటు క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌లు మంగళగిరిలోనే జరుగుతాయి. ఈ లీగ్‌లో మొత్తం ఏడు జట్లు పాల్గొంటున్నాయి.

Also Read:Ayodhya Donation Case: అయోధ్య రామాలయంలో భారీగా నగలు, నగదు మాయం.. సిట్ దర్యాప్తులో షాకింగ్ విషాలు వెల్లడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు