అదిలాబాద్, క్రైమ్ మిర్రర్: దేశానికి అన్నం పెట్టే రైతు ఇలా అర్థాంతరంగా కొనుగోలు కేంద్రంలోనే ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో విషాదం నింపింది. ఆరుగాలం శ్రమించిన పండించిన జొన్న పంటను ఎంతో సంతోషంగా కొనుగోలు కేంద్రానికి వస్తే అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు ప్రక్రియలో జాప్యం కావడంతో తీవ్ర మనాస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో
నింపింది.
Also Read:ఈ నెల 21 నుంచి మీనాక్షి నటరాజన్ పలు నియోజకవర్గాల్లో పర్యటన…
ఆదిబాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో తాను పండించిన జొన్న పంటను విక్రయించేందుకు మే 23న తేదీన సిరికొండ కొనుగోలు కేంద్రానికి నుగూరే పాండురంగ్(48) అనే రైతు తీసుకువెళ్లాడు. హమాలీలకు డబ్బులు చెల్లించిన అనంతరం లారీలో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు ఇవ్వాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది డిమాండ్ చేసారు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, పది రోజులైనా జొన్నలు లోడ్ చేయలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read:దగ్గు సిరప్‌లపై కేంద్రం కఠిన నిర్ణయం.. ఇక ఎవ్వరికి దొరకనట్టే…!
అయితే పంట కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగకపోవడంతో అతను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హమాలీలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించినప్పటికీ, జొన్నలను లారీలో లోడ్ చేయడానికి అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాండురంగ్ వద్ద అదనపు డబ్బులు లేకపోవడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది.
Also Read:కొడుకును హీరోగా లాంచ్ చేయనున్న ధనుష్…!