క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ప్రజలు ఎండలు మరియు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండాకాలం ముగిసి, నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, వేడి తీవ్రతలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా విపరీతమైన చెమటలు పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడుతుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతోంది. “నైరుతి వచ్చినా ఇదేం వేడిరా బాబూ” అని జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.అయితే, వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మరికొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ వర్షాలు కురిస్తే తప్ప, ఈ తీవ్రమైన ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు.ఉష్ణోగ్రతలు మరియు ఉక్కపోత అధికంగా ఉన్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినన్ని నీళ్లు తాగుతూ, ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలలో వర్షాలు పడినా కూడా మాత్రం కామన్ గా మారిపోయింది అని ప్రజలు చిరాకు వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీకి రాజకీయ సమాధి తప్పదు: మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
మమతా ఓటమి కనువిప్పు.. ప్రాంతీయ పార్టీలు గుణపాఠంగా తీసుకోవాల్సిందే!!