Homeక్రైమ్ప్రియుడు కోసం బిడ్డనే చంపి.. సంచలనం సృష్టిస్తున్న ఐదేళ్ల చిన్నారి హత్య ఘటన.!

ప్రియుడు కోసం బిడ్డనే చంపి.. సంచలనం సృష్టిస్తున్న ఐదేళ్ల చిన్నారి హత్య ఘటన.!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే వదిలేసింది. ఇద్దరూ విడిపోయిన తర్వాత తన వద్దకు వచ్చిన ఐదేళ్ల చిన్నారిని కూడా దారుణంగా హత్య చేసింది ఒక మహిళ. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చిన్నారిని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడుతో కలిసి ఆడిన నాటకాన్ని తాజాగా పోలీసులు చేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులోని దావనగిరేకు చెందిన ప్రవీణ్, ప్రియాంక 15 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా జీవనాన్ని సాగించారు. ఫలితంగా ఇద్దరు పిల్లలు జన్మించారు. వీరికి 11 ఏళ్ళ కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. వీరు కాడుగోడిలో ఉంటున్న సమయంలో తనతో కలిసి పాఠశాలలో చదువుకున్న మోహన్ ఆమెకు తారసపడ్డాడు. చిన్ననాటి పరిచయం కాస్త వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే ఇద్దరు పరిచయాలు పెంచుకున్నారు. ప్రియాంక న్యాయవాదిగా చేస్తున్నట్లు మోహన్ కు వెల్లడించింది. మోహన్ కూడా తాను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నట్టు ప్రియాంకకు తెలియజేశాడు. భారీగా ఆస్తులు ఉన్నట్లు చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. క్రమంగా ఇద్దరూ సన్నిహితులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వీరి సాన్నిత్యం ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకుంది. ఇదే విషయాన్ని ప్రవీణ్ గుర్తించి ఇద్దరినీ పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ప్రవీణ్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అయినా ప్రియాంక మనసు మార్చుకోకపోగా ఇల్లు వదిలి వెళ్ళిపోయి మోహన్ తో సహ జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. మోహన్ తనతోపాటు కుమారుడుని తీసుకువెళతానని చెప్పగా, ప్రియాంక తన ఐదేళ్ల కూతురుతో ఉంటానని చెప్పింది. ఇలా విడిపోయిన ఇద్దరూ లీగల్ గాను విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే భర్తకు ప్రియాంక విడాకుల నోటీసులను పంపించింది.

పోస్టుమార్టం నివేదికతో అసలు విషయం వెలుగులోకి..

కొద్దిరోజుల తర్వాత కుమార్తె వెన్నెల అనారోగ్యం బారిన పడే మృతి చెందిందని తన భర్తకు సమాచారాన్ని అందించింది. ఇదే విషయాన్ని సోదరుడికి కూడా చెప్పింది. అంత్యక్రియలను పూర్తి చేసినట్లు వెల్లడించింది. అయితే పోస్టుమార్టం నివేదికను భర్తకు పంపించింది. తొలి నుంచి చిన్నారి మృతి పట్ల అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న భర్త ప్రవీణ్ పోస్టుమార్టం నివేదికను విదేశాల్లో ఉంటున్న తన స్నేహితురాలైన వైద్యురాలికి పంపించాడు. పోస్టుమార్టం నివేదిక సమగ్రంగా లేదని చెప్పడంతో ప్రవీణ్ తన భారీపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో తీవ్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిడ్డను అడ్డు తొలగించుకునే ఉద్దేశంతో గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో ప్రియాంక లవర్ మోహన్ ను అరెస్టు చేశారు. అప్పటినుంచి ప్రియాంక పరారీలో ఉంది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు హాసనలో తలదాచుకున్నట్లు గుర్తించి అక్కడికి చేరుకొని అరెస్టు చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించడంతో ప్రియాంక వాస్తవాలను అంగీకరించింది. ప్రియుడితో కలిసి సన్నిహితంగా ఉండాలన్న ఉద్దేశంతోనే పాప అడ్డు తొలగించుకున్నట్లు వెల్లడించింది. మోహన్ మాయ మాటలు ఆమెను తప్పుదారి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. కోటీశ్వరుడునంటూ నమ్మబలికిన అతన్ని ఆమె నమ్మి బాగా చేరువయ్యాక అతని వద్ద ఏమీ లేదని తెలుసుకొని భారంగానే అతనికి సహకారం అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆమె బిడ్డను పోగొట్టుకోవడం గమనార్హం. మోహన్ కోటీశ్వరుడు కాదని అద్దెల బ్రోకర్ అని తేలగా ఇప్పుడు ఈ హత్య కేసులో ఆమె అడ్డంగా దొరికిపోయి బ్రతుకునే చీకటమయం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అడ్డు అదుపు లేని కోరికలతో భర్తకు దూరమై కుమార్తెను చంపి జైలు పాలైన ఈ ప్రియాంక ఘటన ఎంతోమంది మహిళలకు గుణపాఠంగా నిలుస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు