Homeతెలంగాణజ‌న‌సేన జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్‌...! మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు....

జ‌న‌సేన జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్‌…! మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు….

కాకినాడ, క్రైమ్ మిర్ర‌ర్‌: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన జనసేన పార్టీ, ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ నెల 14 నుండి 16 వరకు మూడు రోజుల పాటు జనసేన పార్టీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా ఈ సమావేశాలకు హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన సిద్ధాంతాలను, భావజాలాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటనను ఒక వేదికగా మలుచుకోనున్నారు.ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం సేన గళం . సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతిని పెంపొందించడం, కుల రాజకీయాలకు అతీతంగా అభ్యుదయ భావాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేటి తరం యువత జెన్ జీ ఆకాంక్షలకు అనుగుణంగా, రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా ఈ సేన గళం పనిచేయనుంది.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం.. కిందపడిన ఉక్కు ద్రావణం.!

ఈ వేదిక ముఖ్య ఉద్దేశాలు, ఆశయాలను జాతీయ మీడియా ద్వారా దేశ ప్రజలకు పవన్ కల్యాణ్ వివరించనున్నారు.ఢిల్లీ పర్యటన కోసం జనసేన పార్టీకి చెందిన సుమారు 150 మంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు తరలివెళ్లనున్నారు. దేశ రాజధానిలో జనసేన క్యాడర్ ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి. మూడు రోజుల పాటు జరిగే ఈ విస్తృత స్థాయి సమావేశాల్లో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ మరియు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలలో పార్టీ విస్తరణపై పవన్ కల్యాణ్ లోతుగా చర్చించనున్నారు. పాతకాలపు బూజుపట్టిన కుల రాజకీయాలను, వ్యక్తిగత దూషణల సంస్కృతిని పక్కనపెట్టి.. వాస్తవాలు, ప్రజాహితం ఆధారంగానే రాజకీయాలు సాగాలన్నదే పవన్ కల్యాణ్ ఆలోచన.

Also Read: బ్రేకింగ్ న్యూస్.. ఫ్యాన్స్ ఓకే అంటేనే రాజకీయాల్లోకి ఎంట్రీ!

ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఒక కులం వారు విమర్శిస్తే అదే కులం వారితో తిట్టించాలి” అనే పాత ధోరణికి స్వస్తి పలకాలని ‘సేన గళం’ ద్వారా ఆయన పిలుపునిచ్చారు. ఈ వినూత్న పొలిటికల్ ఫిలాసఫీని జాతీయ స్థాయిలో ప్రజలకు పరిచయం చేయడం ఈ ఢిల్లీ టూర్ ప్రధాన ఎజెండా.ఢిల్లీ పర్యటన ముగింపు రోజున పవన్ కల్యాణ్ జాతీయ స్థాయి నేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇటీవల ఏపీలో ఒక రాజ్యసభ స్థానం కూడా దక్కడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జాతీయ స్థాయిలో జనసేన గళాన్ని బలంగా వినిపించడానికి, దేశ రాజధానిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడానికి ఈ 3 రోజుల ఢిల్లీ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు