Homeఅంతర్జాతీయంబెంగాల్లో మమతాకు ఇంకో ఛాన్స్...!

బెంగాల్లో మమతాకు ఇంకో ఛాన్స్…!

  • బిజెపికి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ లేదు

  • తృణమూల్ కాంగ్రెస్ ఏకైక వ్యతిరేక పక్షం

  • దీదీ మళ్లీ సున్నా నుంచి ప్రారంభం కావాల్సిందే..

  • మునుపటి దూకుడు ప్రదర్శిస్తేనే ఆ పార్టీకి భవిత

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: జాతీయ రాజకీయాల్లో మమతా బెనర్జీది చెరగని ముద్ర. జాతీయ కాంగ్రెస్ పార్టీని కాదని ఒక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి.. వామపక్ష భావజాలాన్ని తన కూకటి వేళ్ళతో పెకిలించిన గొప్ప నాయకురాలు. బెంగాల్ రాజకీయాల్లో దాదాపు దశాబ్దపున్నర కాలం విశేష ప్రభావం చూపించిన మహిళా నేత.

ఏ దూకుడుతో అయితే తన పార్టీని బెంగాల్ లో నిలబెట్టారో.. అదే దూకుడు ప్రభావానికి ఇప్పుడు ఆమె పార్టీ బాధితురాలిగా నిలవడం విశేషం. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెట్టుకొకరు, పుట్ట కొకరు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. దానికి కారణం భయం. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీని ఏ భయం చూపించి తన గుప్పెట్లో తెచ్చుకున్నారో.. ఇప్పుడు అదే భయం వామపక్షాలకు వెంటాడుతోంది.

ఆ పార్టీ నేతల వైఖరితోనే..
మమతా బెనర్జీ కంటే బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్ నేతల వైఖరిని ఎక్కువగా వ్యతిరేకించారు. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీని ఉక్కు పాదం మోపే క్రమంలో మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు చాలా ఘోరంగా ఉండేది. అసలు ప్రత్యర్థులే లేని రాష్ట్రంగా మార్చే క్రమంలో ఆమె రాజకీయ వ్యూహంతో విపక్షాలు విలవిలలాడాయి. ఇప్పుడు అదే ప్రభావం తన పార్టీపై పడుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ బేజారు అవుతోంది.. చివరకు తన ఆత్మీయులు సైతం తనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు.

1990వ దశకంలో మమతా బెనర్జీ ఏ దూకుడుతో అయితే వ్యవహరించారో.. ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కూడా అదే దూకుడు కనబరిస్తే కానీ ఆ పార్టీకి బెంగాల్లో మనుగడ ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్ళీ జీరో నుంచి ప్రారంభం కావాల్సిందే. కానీ ఆ తెగువ, ఆ దూకుడు మమతా బెనర్జీ ప్రదర్శించగలరా? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మమతా బెనర్జీ కంటే ఆ పార్టీ నేతల అరాచకాన్ని బెంగాల్ ప్రజలు మరిచిపోలేదు. వారు మరవాలంటే మమతా బెనర్జీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకోవాలి. అందుకు ఆమె వయస్సు సహకరిస్తుందా? మునుపటి దూకుడు ప్రదర్శించగలరా? అనేది ఒక రకమైన అనుమానమే.

ప్రత్యామ్నాయం లేకపోవడంతో..
అయితే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ కు ఒక ఆప్షన్ ఉంది. బిజెపికి ప్రత్యామ్నాయ పార్టీ అంటూ ఒకటి లేదు. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీని మమతా బెనర్జీ నిర్వీర్యం చేశారు. అయితే మరో ఆశా కిరణం సౌరవ్ గంగూలీ. పశ్చిమ బెంగాల్ ఆశాదీపం గా గంగులిని అక్కడి ప్రజలు చూస్తుంటారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటారు. తమిళనాడులో విజయ్ మాదిరిగా ఊహించుకుంటారు.

కానీ గంగూలీ మాత్రం అస్సలు రాజకీయ వాసనలు పీల్చుకోదలుచుకోలేదు. అది మాత్రం మమతా బెనర్జీకి కలిసి వచ్చే అంశం. బిజెపికి ప్రత్యామ్నాయం అంటూ ఉంది అంటే అది కేవలం తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే. అదే మమతా బెనర్జీ తన రాజకీయ వ్యూహాలను పదును పెట్టి ముందుకు సాగితేనే ఆమె పార్టీకి భవిష్యత్తు. లేకుంటే మాత్రం బెంగాల్లో కష్టమే.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు