HomeసినిమాG2 కోసం అడివి శేష్ మైండ్‌లో మాస్టర్ ప్లాన్..!

G2 కోసం అడివి శేష్ మైండ్‌లో మాస్టర్ ప్లాన్..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్ సినిమాలకు కొత్త దారి చూపించిన గూఢచారి ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. యాక్షన్, సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న *గూఢచారి 2 (G2)*పై కూడా మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి భాగం వచ్చిన తర్వాత ఈ సీక్వెల్ రావడానికి చాలా గ్యాప్ పడటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు.. శేష్ ప్లాన్ ఏంటి అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి G2ను మరింత భారీ స్థాయిలో, పాన్ ఇండియా రేంజ్‌లో తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు.. దేశవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఇంటర్నేషనల్ లెవల్ స్పై థ్రిల్లర్‌గా సినిమా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల డెకాయిట్ షూటింగ్‌తో పాటు G2 పనుల్లో బిజీగా గడిపిన అడివి శేష్ ప్రస్తుతం చిన్న బ్రేక్‌లో ఉన్నారని సమాచారం. అమెరికాలో కుటుంబ సభ్యులతో టైమ్ గడుపుతూ కొంత విశ్రాంతి తీసుకుంటున్నారట. అయితే ఈ విరామం పూర్తయ్యాక మళ్లీ పూర్తిగా G2పైనే దృష్టి పెట్టనున్నట్టు టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఆలోచనలో శేష్ ఉన్నారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో కనిపించనుండగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు