క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: ఏపీ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు జూన్ 1 నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది రైల్వే శాఖ. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. విశాఖలోని వి.ఎం.ఆర్.డి.ఏ డెక్ భవనాన్ని తాత్కాలిక కార్యాలయానికి కేటాయించారు. జోనల్ మేనేజర్ తో పాటు ఉద్యోగుల నియామక ప్రక్రియ పూర్తి చేశారు.
ఆ నాలుగు డివిజన్లతో కలిపి…
విశాఖ కేంద్రంగా ప్రారంభమైన ఈ జోన్ పరిధిలో 385 రైల్వే స్టేషన్లు, 62,000 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. జోన్ పరిధిలో 3532 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉండనుంది. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ కొత్త జోన్ లోకి వస్తాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ ఉండగా.. దాని స్థానంలో కొత్తగా విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా కొత్త జోన్ పరిధిలోకి రానుంది. మొత్తం నాలుగు డివిజన్లలో ఈ రైల్వే జోన్ విస్తరించి ఉంటుంది.
కార్యకలాపాలన్నీ…
ఇకనుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖ డివిజన్లో పరిధిలో జరిగే భద్రతాపరమైన పనులు, రైళ్ల రాకపోకలు, ఆలస్యంగా నడిచే రైళ్ల వివరాలు, రైల్వే కార్యకలాపాలన్నీ ఇక విశాఖ జోన్ పరిధిలోకి రానున్నాయి. ఈ డివిజన్లో డిఆర్ఎమ్ లు ఇప్పటి వరకు సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ మధ్య రైల్వే జోన్ కు నివేదికలు ఇస్తుండేవి. ఇకనుంచి విశాఖ జోన్ కు నివేదించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి కొత్త రైళ్ల ప్రారంభం పై రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖ టు తిరుపతి వందే భారత్ స్లీపర్ పైన త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి మరిన్ని రైలు సర్వీసులు ప్రారంభమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే జూన్ 1న రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండడంతో ఉత్తరాంధ్రవాసుల ఆశలు తీరినట్టే