Homeఅంతర్జాతీయంగొర్రెల కాపరి ఉద్యోగానికి నోటిఫికేషన్.. భారీగా వచ్చిన దరఖాస్తులు.!

గొర్రెల కాపరి ఉద్యోగానికి నోటిఫికేషన్.. భారీగా వచ్చిన దరఖాస్తులు.!

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్:-
బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం చేస్తావో.. చదువు మానేసి గొర్రెలకు కాసుకుంటావో.. అన్న మాటలను మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు. చదివేందుకు ఇష్టపడని పిల్లల గురించి ఎంతోమంది తల్లిదండ్రులు ఈ తరహా మాటలు చెబుతుంటారు. అయితే చదువుకొని నిరుద్యోగిగా ఉండడం కంటే చదువు మానేసి గొర్రెలు కాపరిగా ఉంటే భారీగా వేతనాలు పొందొచ్చు. అవును మీరు చదివింది నిజమే. గొర్రెలు కాస్తే వేతనం ఏమిటి అనుకుంటున్నారా. అయితే ఆ వివరాలు చదివేయండి మరి.

రెండు గొర్రెల కాపరి ఉద్యోగాల కోసం తాజాగా ఒక సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. చైనాలోని మంగోలియా సరిహద్దు ప్రాంతంలో గొర్రెల కాయడానికి కేవలం ఇద్దరు వ్యక్తులు కావాలంటూ జువో జియో వోయాంగ్ అనే ఒక ఫామ్ ఓనర్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ పోస్ట్ చైనా ట్విట్టర్ అయినా విబోలో 5.9 కోట్ల వ్యూస్తో నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. దీంతో గొర్రెల కాపరి ఉద్యోగానికి సంబంధించి ఇచ్చిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకటనకు సంబంధించిన నోటిఫికేషన్ అనేక దేశాల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత్ లోను కోట్లాదిమంది ఈ నోటిఫికేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

700 మందికిపైగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు..

రెండు గొర్రెల కాపరి ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వగా 700 మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో చైనాలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది అన్న విషయం మరోసారి బహిర్గతమైనది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులు పూర్తిచేసిన ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి అందులో పేర్కొన్న కీలకమైన అంశాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యే అభ్యర్థికి నెలకు 1,10,000 కు పైగా జీతాన్ని చెల్లిస్తామని సదరు నోటిఫికేషన్ ఇచ్చిన యజమాని పేర్కొన్నారు. వేతనంతో పాటు ఉచితంగా వసతి, గ్రాసరీస్ కూడా అందించనున్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాన్ని పట్ల ఆసక్తిని చూపించారు.

ఆ ఉద్యోగాలతో పోస్తే బెటరు అన్న ఆలోచన..

ప్రస్తుతం చైనాలోని అనేక ఉద్యోగాల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులు కూడా వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పశువులు మాదిరిగా పని చేయించుకుంటున్నారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో పెరిగిన ఏఐ భయాలు ఉద్యోగులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని ఆందోళన వారిలో ఉంది. అలాగే చైనా ప్రైవేట్ కంపెనీల యావరేజ్ శాలరీ రూ.70 వేలు మాత్రమే. ఈ గొర్రెల కాపరి ఉద్యోగానికి ఇస్తున్న వేతనం దీనికంటే అధికంగా ఉండడంతో చాలామంది నిరుద్యోగులు ఆసక్తి చూపించారు. అయితే ఈ గొర్రెలకు కాపరి ఉద్యోగం కూడా అనుకున్నంత ఈజీ కాదు. వేసవి కాలంలో 4900 ఎకరాల విస్తీర్ణంలో 3000 గొర్రెలను మేపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ ఆయన కుర్రాలను సింగిల్సును నమ్ముకుండా గతంలో ఫార్మింగ్ అనుభవం ఉండి ఒంటరితనాన్ని తట్టుకోగల 1980లో పుట్టిన రెండు జంటలను అంటే మొత్తం నలుగురిని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. మరో 40 జంటలను వెయిటింగ్ లిస్టులో పెట్టాడు. సిటీ లైఫ్ నరకంగా మారితే మనుషులు గొర్రెలు కాపర్లుగా మారడానికి రెడీ అవుతారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు