Homeక్రైమ్Murder : మూడు కోట్లతో భర్తకు బీమా.. 10 లక్షల సఫారీ ఇచ్చి హత్య

Murder : మూడు కోట్లతో భర్తకు బీమా.. 10 లక్షల సఫారీ ఇచ్చి హత్య

వివాహేతర సంబంధాలు ఈ మధ్యకాలంలో అకృత్యాలకు దారితీస్తున్నాయి. తమ అడ్డగోలు వ్యవహారాలకు అడ్డుగా ఉంటున్నారని ఉద్దేశంతో వివాహతర సంబంధాలు పెట్టుకుంటున్న వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని హతమార్చేందుకు వెనుకాడడం లేదు. ఈ సలహా హత్యలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణలో ఈ తరహా హత్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివాహత్ర సంబంధం నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఒక భార్య మూడు కోట్లకు భీమా చేయించి హత్య చేయించింది. ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు విచారణ సాగించిన పోలీసులకు విషయాలు వెల్లడయ్యాయి.

  • ప్రణాళిక ప్రకారం మూడు కోట్లకు భీమా సదుపాయం..

మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిని కుమార్ (40), ఆయన భార్య భారతి నివసిస్తున్నారు. వీరిద్దరికి కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ అన్యోన్యంగానే ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో భారత్ కి అదే ప్రాంతానికి చెందిన లగిశెట్టి సురేంద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త సాయిని కుమార్కు తెలియడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వీరిద్దరూ తమకు అడ్డుగా ఉంటున్న భర్తను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పధకం ప్రకారం స్కెచ్ వేశారు. భర్తను అడ్డు తొలగించుకోవడంతోపాటు ఆయన మృతి ద్వారా కొంత డబ్బులు వచ్చేలా చూసుకోవాలని భారతి భావించింది. ఈ క్రమంలోనే భర్తకు మూడు కోట్ల రూపాయల ప్రమాద బీమా వచ్చేలా భీమా చేయించింది. దీంతో ముందుగా వేసుకున్న తమ ప్రణాళికను అమలు చేసుకునేందుకు సిద్ధపడ్డారు వివాహేతర సంబంధం పెట్టుకున్న భారతి, సురేంద్ర. ఇందుకోసం సఫారీ గ్యాంగ్ తో మాట్లాడి సాయిని కుమార్ ని హత్య చేయించారు.

  • మద్యం తాగించి ఇనుపు సుత్తితో తలపై మోది హత్య..

ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం మూడు కోట్లకు జీవిత బీమా పాలసీలు చేయించారు. ఏడాది కిందట ఈ పాలసీలు చేయించిన వీరిద్దరూ హత్యకు ప్రణాళికలు రచించారు. రామ్ మల్లేష్ అనే వ్యక్తికి కుమార్కు పాత గొడవలు ఉన్నాయి. దీంతో భారతి, సురేంద్ర రాం మల్లేష్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సాయిని కుమారును హత్య చేస్తే 10 లక్షలు ఇస్తామని మాట్లాడుకున్నారు. మల్లేష్ తన స్నేహితుడు శ్రీరామ్ కుమార్ తో కలిసి హత్యకు ప్రణాళిక వేశాడు. వీరిద్దరూ కలిసి ఈనెల 22న కుమార్కు మద్యం తాగించి ఇనుప సుత్తితో తలపై మోదీ హత్య చేశారు. ఆ తర్వాత ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం చనిపోయిన సాయిని కుమార్ మృతదేహాన్ని ఆయన బైకును రోడ్డుపై పెట్టేశారు. ఈ హత్య విషయం తెలీదు అన్నట్లుగా ఫిర్యాదు భారతి ఫిర్యాదు చేసింది. తొలుత పోలీసులు రోడ్డు ప్రమాదంగా భావించి విచారణ చేపట్టారు. అయితే పోలీసులు కూపీ లాగడంతో డొంక కదిలింది. చివరకు భార్య భారతి, ఆమె ప్రియుడు సురేంద్ర ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు