Homeవైరల్జుట్టు బలంగా ఉండాలంటే వారానికి ఎన్నిసార్లు నూనె రాయాలి?

జుట్టు బలంగా ఉండాలంటే వారానికి ఎన్నిసార్లు నూనె రాయాలి?

క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- వేసవి వచ్చిందంటే జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి. ఎండ తీవ్రత, చెమట, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టు త్వరగా పొడిబారి నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, బలహీనపడటం వంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఇలాంటి సమయంలో జుట్టుకు నూనె రాయాలా.. వద్దా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం వేసవిలో సరైన పద్ధతిలో నూనె వాడితే జుట్టుకు మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.వేసవిలో జుట్టుకు నూనె రాసుకునేందుకు రాత్రి సమయం మంచిదిగా భావిస్తారు. పడుకునే ముందు తేలికగా నూనె రాసుకుని, ఉదయం తలస్నానం చేస్తే తల చర్మానికి అవసరమైన పోషణ అందుతుంది. అలాగే జుట్టు పొడిబారకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. బయట ఎండ, వేడి ప్రభావం వల్ల కోల్పోయిన తేమను నూనె తిరిగి అందిస్తుంది.

జుట్టుకు నూనె రాసే ముందు కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవడం ఇంకా మంచిది. తర్వాత చేతివేళ్లతో నెమ్మదిగా తల చర్మానికి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు కుదుళ్లు బలపడతాయి. తలకు రిలాక్స్ కూడా అనిపిస్తుంది.

వారానికి ఎన్నిసార్లు అంటే!

వారానికి ఎన్ని సార్లు నూనె రాయాలనే విషయంలో కూడా నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. వేసవిలో ప్రతిరోజూ నూనె రాయాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు రాసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువగా వాడితే చెమట, దుమ్ము తలకు ఎక్కువగా చేరి జుట్టు జిడ్డుగా మారే అవకాశం ఉంటుంది.జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం నూనె లేదా షాంపూ మాత్రమే సరిపోవు. మంచి పోషకాహారం కూడా చాలా ముఖ్యం. పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, తగినంత నీరు తీసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది. సరైన నిద్ర, ఒత్తిడి తగ్గించడం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
కాబట్టి వేసవిలో జుట్టు సంరక్షణపై కొద్దిగా శ్రద్ధ పెడితే.. జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉండటంతో పాటు బలంగా కూడా పెరుగుతుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు