క్రైమ్ మిర్రర్,వైరల్ న్యూస్:- కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు ఎక్కువ స్టోరేజ్ ఉంటే ఇక సమస్యే ఉండదనిపిస్తుంది. కానీ కొన్ని నెలలకే స్టోరేజ్ ఫుల్ అని వార్నింగ్ రావడం, కొత్త యాప్స్ డౌన్‌లోడ్ కాకపోవడం, ఫోన్ నెమ్మదిగా మారడం చాలామందికి ఎదురవుతున్న సమస్య. ఫోటోలు కూడా ఎక్కువ లేవు.. అయినా మెమొరీ ఎలా నిండిపోయింది? అనే సందేహం రావడం సహజం. దీనికి కొన్ని సాధారణ కారణాలే ఉంటాయి.ఇప్పటి మొబైల్ యాప్స్ గతంతో పోలిస్తే చాలా భారీగా మారాయి. సోషల్ మీడియా, గేమ్స్, వీడియో స్ట్రీమింగ్ యాప్స్‌లో కొత్త ఫీచర్లు, AI టూల్స్, హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఉండటంతో ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటాయి. మొదట చిన్న సైజులో ఉన్న యాప్.. వరుస అప్‌డేట్స్‌తో క్రమంగా పెద్దదైపోతుంది.
ఫోన్ స్టోరేజ్‌ను ఎక్కువగా ఆక్రమించేది ఫోటోలు, వీడియోలే. ఇప్పుడు మొబైల్ కెమెరాలు హై రిజల్యూషన్‌లో ఫోటోలు, 4K వీడియోలు తీస్తున్నాయి. కొన్ని నిమిషాల వీడియో కూడా చాలా స్పేస్ తీసుకుంటుంది. రోజూ తీసే ఫోటోలు, వాట్సాప్‌లో వచ్చే మీడియా కూడా తెలియకుండానే మెమొరీని నింపేస్తాయి.మరో ముఖ్యమైన కారణం క్యాచీ డేటా. బ్రౌజర్, మ్యాప్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి యాప్స్ వేగంగా పని చేయడానికి తాత్కాలిక ఫైళ్లను సేవ్ చేస్తాయి. ఇవి కనిపించకపోయినా.. ఫోన్ స్టోరేజ్‌లో మంచి భాగాన్ని ఆక్రమిస్తాయి.ఇంకా చాలామంది క్లౌడ్‌లో బ్యాకప్ ఉన్నా.. ఫోన్‌లో ఒరిజినల్ కాపీలను అలాగే ఉంచేస్తారు. దీంతో ఒకే డేటా రెండు చోట్ల ఉండి స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది.ఫోన్ మెమొరీ క్లీన్‌గా ఉంచుకోవాలంటే కొన్ని అలవాట్లు ఉపయోగపడతాయి. అవసరం లేని యాప్స్ తొలగించడం, క్యాచీ డేటా క్లియర్ చేయడం, ఫోటోలు-వీడియోలను క్లౌడ్‌లో బ్యాకప్ చేయడం, డూప్లికేట్ ఫైల్స్ డిలీట్ చేయడం మంచిది.స్టోరేజ్ ఫుల్ అయితే కేవలం కొత్త యాప్స్ డౌన్‌లోడ్ కాకపోవడమే కాదు.. ఫోన్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది. అందుకే తరచూ స్టోరేజ్ చెక్ చేసుకుంటూ.. అనవసర ఫైళ్లను తొలగిస్తే ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది.