రాజమండ్రి, క్రైమ్‌మిర్రర్:రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుంచి గోదావరిలో పడవ మీదుగా పుష్కరాల పనులు, గోదావరి తీర ప్రాంతం కాలుష్యం తదితర అంశాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. “కాలుష్యరహిత గోదావరి” అనే లక్ష్యంతో గోదావరి పుష్కరాలను తిష్టాత్మకమైన రీతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు శానిర్దేశం చేసారు. * నల్లా ఛానెల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్ధాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి, గోదావరి పేపర్ మిల్ వ్యర్ధ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ శ్రీకృష్ణయ్య ని ప్రశ్నించి వివరాలు అడిగారు.
నల్లా ఛానల్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన పవన్ కళ్యాణ్, రోజువారి వ్యర్ధాలను ఎలా వేరు చేస్తున్నారని వచ్చే మురికి నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారని, శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తున్నారా అని ఆరా తీసారు.* నల్లా ఛానల్ ద్వారా రోజువారి ఎన్ని మిలియన్ లీటర్ల మురుగునీరు గోదావరిలోకి నేరుగా వస్తోంది, దీనిలో ఎంత భాగం నీరు శుద్ధి అవుతోంది అన్న విషయంపై ఆరా తీసారు. * రోజువారి సుమారు 55 ఎం.ఎల్.డి. ల మేర మురుగు నీరు రాజమహేంద్రవరంలో గృహాల నుంచి విడుదల అవుతోందనీ, దీనిలో కేవలం 15 శాతం మేర మాత్రమే సీవరేజ్ ప్లాంట్ల ద్వారా నీరు శుద్ధి అవుతోంది అని అధికారులు వివరించారు.
కేంద్రం ద్వారా వచ్చే నిధులను పారదర్శకంగా వినియోగించుకోవాలని, మురుగు నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాత గోదావరిలోకి వదిలేలా చూడాలని అయన సూచించారు. * గోదావరి పుష్కరాల పనులు జరుగుతున్న తీరును ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సి సోము వీర్రాజు, , రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గోన్నారు.