Homeక్రైమ్విషాదం: పనిలో చేరిన 8 రోజులకే మరణం...!

విషాదం: పనిలో చేరిన 8 రోజులకే మరణం…!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోకుల్ ప్లాట్స్‌లోని శ్రీ రెసిడెన్సి అపార్ట్‌మెంట్‌లోని నీటి సంపు (Sump) లో పడి 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మరణించిన బాలికను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన చరణ్, రేణుక దంపతుల కుమార్తె సారా (13) గా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రులు గత 10 సంవత్సరాలుగా మియాపూర్ పరిధిలో వాచ్‌మెన్‌గా జీవనం సాగిస్తున్నారు. వారు ఎనిమిది రోజుల క్రితమే ఈ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్లుగా చేరారు.

రాత్రి సమయం సుమారు 7:30 గంటలకు సంపు మూత తీసి ఉండటంతో, నీటి స్థాయిని చూసేందుకు వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు భావిస్తున్నారు. కుమార్తె కనిపించకపోవడంతో గాలించిన తల్లిదండ్రులు, చివరకు నీటి సంపులో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కనుగొన్నారు. వెంటనే నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమె మృతిపై తల్లిదండ్రులు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారంతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ మరణం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు