హైదరాబాద్, క్రైమ్మిర్రర్: న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా నటించారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా
రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్నిసొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమయ్యింది. “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆహా గోల్డ్ యూజర్స్ 24 గంటల ముందుగానే
ఈ చిత్రాన్ని చూడొచ్చు. థియేట్రికల్ గా ప్రేక్షకుల్ని అలరించిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఇప్పుడు ఆహా ద్వారా మరింతమంది ఆడియెన్స్ కు చేరువకానుంది. నటీనటులు – సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు