Homeఆంధ్ర ప్రదేశ్ఆర్థిక వృద్దిలో విశాఖ సరికొత్త రికార్డు...!

ఆర్థిక వృద్దిలో విశాఖ సరికొత్త రికార్డు…!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విశాఖ మరోసారి చర్చకు దారి తీసింది. రాష్ట్ర ఆర్థిక రాజధాని అనిపించుకుంది. సరికొత్త జిడిపితో సత్తా చాటింది విశాఖ. కూటమి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ సంస్థలు వెల్లువలా వస్తున్నాయి. పారిశ్రామిక, ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. పెట్టుబడులు కూడా భారీగా వస్తుండడంతో ఏపీలో పారిశ్రామిక కళ కనిపిస్తోంది. తాజాగా లక్ష 61 కోట్ల జిడిపితో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. అందులో ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి.. ప్రధానంగా స్వర్ణాంధ్ర 2047 దార్శనికత అమలుకు సంబంధించి సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా సమీక్షించారు.

ఆదాయం పెంచుకునేందుకు…

రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా కొన్ని రకాల వ్యూహాలు అమలు చేస్తోంది ప్రభుత్వం. 2047 విజన్ కింద కొన్ని రకాల లక్ష్యాలను కూడా నిర్దేశించింది. 2004 నాటికి రాష్ట్ర జిఎస్టిపిని రూ.308 లక్షల కోట్లకు… తలసరి ఆదాయాన్ని 55 లక్షల రూపాయలకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పది సూత్రాల మిషన్ పేరుతో ఈ లక్ష్యాలను అందుకునే పనిలో పడింది. ఇందుకుగాను 651 కీలక పనితీరు సూచికలతో కూడిన సమగ్ర డాష్ బోర్డును రూపొందించారు. దీని ద్వారానే జిల్లాల పురోగతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం కలెక్టర్ల సదస్సులో నివేదికలను బయటపెట్టారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం 17.62 లక్షల కోట్ల జిఎస్టిపితో 10.75% వృద్ధిని నమోదు చేసింది. దేశ సగటుతో పోలిస్తే ఇది గణనీయమైన పురోగతి. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 7.83 వృద్ధిని నమోదు చేయగలిగింది రాష్ట్రం. ప్రధానంగా చేపల పెంపకానికి సంబంధించిన రంగం 19.07 వృద్ధితో అత్యుత్తమ పనితీరును కనబరిచింది. నిర్మాణరంగం 13.05, కమ్యూనికేషన్ రంగం 17.05, బ్యాంకింగ్ తో పాటు బీమా 15.45 వృద్ధిని సాధించాయి. పరిశ్రమల రంగం మొత్తం మీద 9.53, సేవల రంగం 12.94 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

జిల్లాల వారీగా పరిశీలిస్తే బాపట్ల జిల్లా 19.19 వృద్ధితో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబడింది…

విశాఖ జిల్లా లక్ష 61 కోట్ల జిడిపితో రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా నిలిచింది. తలసరి ఆదాయంలో ఏకంగా 6.58 లక్షల రూపాయలతో మొదటి స్థానం దక్కించుకుంది. ఆ తరువాత స్థానాల్లో ఎన్టీఆర్, కృష్ణా, తిరుపతి, ఏలూరు జిల్లాలు నిలిచాయి. మరోవైపు అన్నమయ్య జిల్లా మైనస్ 1.35 ప్రతికూల వృద్ధిని నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖను మినహాయిస్తే మిగతా ఉత్తరాంధ్ర జిల్లాలు.. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు తక్కువ తలసరి ఆదాయాన్ని పొందడం విశేషం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు