HomeజాతీయంVijay : త‌మిళ‌నాడులో టీవీకే సంచ‌ల‌న విజ‌యం...! అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఘ‌న‌త‌....!

Vijay : త‌మిళ‌నాడులో టీవీకే సంచ‌ల‌న విజ‌యం…! అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఘ‌న‌త‌….!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్ : హీరో విజయ్ చాలా తక్కువ టైంలోనే రాజకీయాల్లో అద్భుత ఫలితాన్ని సాధించారు. ఆయన 2024 ఫిబ్రవరి 2నే తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని ప్రకటించారు. 2024 ఆగస్టు 22న పార్టీ జెండాను, గీతాన్ని ఆవిష్కరించారు. 2024 అక్టోబర్ 27న టీవీకే సిద్ధాంతాలను విజయ్ ప్రకటించారు. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం 2026 జనవరి 22న అధికారికంగా ‘విజిల్’ గుర్తును కేటాయించింది. అంటే టీవీకే పార్టీకి గుర్తును మూడు నెలల క్రితమే కేటాయించారు. అయినప్పటికీ అతిస్వల్ప వ్యవధిలోనే అత్యంత వేగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు తన పార్టీ గుర్తును, అజెండాను చేరవేయడంలో విజయ్ సక్సెస్ అయ్యారు.

ఏ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా మొత్తం 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మార్చి 18నే ఆయన ప్రకటించారు. వ్యూహంలో ఎంజీఆర్ బాట వాస్తవానికి డీఎంకే పార్టీని సీఎన్ అన్నాదురై 1949 సెప్టెంబర్ 17న స్థాపించారు. ఆయన 1969 ఫిబ్రవరి 3న మరణించిన అనంతరం కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయానికి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) డీఎంకేలోనే ఉన్నారు. ఆయనకు పార్టీలో మంచి పాపులారిటీ ఉండేది. అన్నాదురై మరణం అనంతరం రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీఎంకే పార్టీని నడిపే విషయంలో కరుణానిధి, ఎంజీఆర్ మధ్య విభేదాలు వచ్చాయి.

1971లో కరుణానిధి మంత్రి వర్గంలోనూ ఎంజీఆర్‌కు చోటు దక్కలేదు. దీంతో డీఎంకే‌లోనే ఉంటూ, కరుణానిధి సర్కారుకు వ్యతిరేకంగా ఎంజీఆర్ మాట్లాడటం మొదలుపెట్టారు. 1972లో డీఎంకే కోశాధికారిగా ఉన్న సమయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే మంత్రుల వ్యక్తిగత ఆస్తుల లెక్కలను విడుదల చేయాలని ఎంజీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో 1972 అక్టోబరు 10న ఎంజీఆర్‌ను డీఎంకే నుంచి బహిష్కరించారు. తనను పార్టీ నుంచి పంపేసిన వారం రోజుల్లోనే 1972 అక్టోబర్ 17న అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ ప్రకటించారు. అన్నాదురై ఆశయాల సాధన కోసం పనిచేసే అసలైన పార్టీ అన్నాడీఎంకేనే అంటూ ప్రజలకు చేరువయ్యారు.

కట్ చేస్తే, 1977 తమిళనాడు ఎన్నికల్లో ఎంజీఆర్ నాయకత్వంలోని అన్నా డీఎంకే కూటమి 144 సీట్లతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది. హీరో విజయ్ సైతం ఇలాంటి వ్యూహాన్నే క్షేత్రస్థాయిలో అమలు చేశారు. డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీ నిలుస్తుందని విజయ్ చేసిన ప్రకటనలు నిజమయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు