Homeవైరల్Riteish Deshmukh:సినిమా ప్రేక్షకులకు సీరియస్ వార్నింగ్...!

Riteish Deshmukh:సినిమా ప్రేక్షకులకు సీరియస్ వార్నింగ్…!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ సినిమా బ్యూరో: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘రాజా శివాజీ’ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌తో ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ, దర్శకత్వం కూడా వహించిన రితేష్ దేశ్‌ముఖ్ ఈ సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేశారు.

సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఒక ముఖ్యమైన విజ్ఞప్తి కూడా చేశారు. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ఎవరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని రితేష్ కోరారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా చెప్పడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

సీరియస్ వార్నింగ్..!

“మీ అందరికీ మా టీమ్ తరఫున ధన్యవాదాలు. మీరు సినిమాను ఇంతగా ఆదరిస్తుండటం మాకు ఆనందంగా ఉంది. కానీ ఒక అభ్యర్థన… దయచేసి థియేటర్లలో వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవద్దు” అని రితేష్ తెలిపారు. ఆయన ఈ విజ్ఞప్తిని మరాఠీలో కూడా రాసి అభిమానులను కోరారు.

ఇటీవల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ప్రేక్షకులు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ క్యామియో ఉన్న సీన్లు వైరల్ అవుతున్నాయి. ఈ కారణంగా సినిమా చూడాల్సిన అసలు అనుభవం తగ్గిపోతుందని, అలాగే సినిమా బిజినెస్‌పై ప్రభావం పడుతుందని రితేష్ అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, జెనీలియా దేశ్‌ముఖ్, సంజయ్ దత్, మహేష్ మంజ్రేకర్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే రితేష్ కుమారుడు కూడా ఈ సినిమాతో నటుడిగా పరిచయం కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు