HomeజాతీయంRare Fox: కచ్ లో అరుదైన నక్క, ట్రాప్ కెమెరాకు చిక్కిన ఫెన్నెక్‌ ఫాక్స్!

Rare Fox: కచ్ లో అరుదైన నక్క, ట్రాప్ కెమెరాకు చిక్కిన ఫెన్నెక్‌ ఫాక్స్!

Rare Fennec Fox Spotted in Gujarat: గుజరాత్‌ సురేంద్రనగర్‌ జిల్లాలో ఉన్న ఉప్పు చిత్తడి ప్రాంతం లిటిల్‌ రణ్‌ ఆఫ్‌ కచ్‌ లో అరుదైన నక్క కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  ప్రపంచంలోనే అత్యంత చిన్న నక్క జాతిగా పేరుగాంచిన ఫెన్నెక్‌ ఫాక్స్‌ ను అటవీ అధికారులు గుర్తించారు. సాధారణంగా ఈ జాతి భారత్‌ లో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు ఆ నక్క ఎలా వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నారు.

అటవీశాఖ ట్రాప్ కెమెరాల్లో చిక్కిన చిన్న నక్క

అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో ఈ చిన్న నక్క చిత్రాలు రికార్డయ్యాయి. ఈ జంతువు బరువు సుమారు 1 నుంచి 1.5 కిలోల మధ్య ఉండగా, పొడవు సుమారు ఒక అడుగు వరకు ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, దాని చెవులు దాదాపు ఆరు అంగుళాల వరకు పొడవుగా ఉంటాయి. దేహంపై లేత పసుపు, గోధుమ రంగు రోమాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

ఎడారి ప్రాంతాల్లో జీవనం

ఈ ఫెన్నెక్‌ ఫాక్స్‌ సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో జీవిస్తుంది. ఎలుకలు, పక్షుల గుడ్లు, చిన్న బల్లులు, కీటకాలు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటుంది. ఇది ఎక్కువగా ఒంటరిగా జీవించే స్వభావం కలిగి ఉంటుంది. రాత్రి సమయంలో చురుకుగా తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతుంది. పగటిపూట ఎండ తీవ్రతను తప్పించుకోవడానికి నేలలో తవ్విన బొరియల్లో విశ్రాంతి తీసుకుంటుంది.  ఈ జాతి ప్రధానంగా ఉత్తర ఆఫ్రికాలోని సహారా ఎడారిలో కనిపిస్తుంది. మన దేశంలో వీటి ఉనికి అత్యంత అరుదు. అందుకే ప్రభుత్వం ఈ జాతిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చింది. ఇప్పుడు ఈ నక్క గుజరాత్‌ లో కనిపించంతో పరిశోధకులు దానిపై పరిశోధనలు జరిపేందుకు రెడీ అవుతున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు