క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- మన దేశ వ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యం ఏదో ఒక పని మీద బయటకు వస్తున్నటువంటి ప్రజలకు ఈ భారీ ఉష్ణోగ్రతలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు దాటగానే ఉష్ణోగ్రతలు ప్రతి 10 నిమిషాలకు పెరుగుతూ పోతుండడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం పట్ల అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా మెండోరా లో ఏకంగా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవ్వడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ వంటి జిల్లాలకు కూడా అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రతిరోజు కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దు అని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఉష్ణోగ్రతలు బారిన పడకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పగటివేల మీతో పాటు మీ చుట్టుపక్కల వారిని కూడా బయటకు వెళ్లకుండా చూసుకోవాలి అని సూచించారు. ఈ వేసవి కాలంలో మరీ ముఖ్యంగా చిన్న పిల్లలను సాయంత్రం ఐదు దాటిన తర్వాతే ఆడుకోవడానికి బయటకు పంపించాలి అని.. ఇక మిగతా సమయంలో ఇంటిలోనే ఉండేలా చూడాలి అని తల్లిదండ్రులకు తెలిపారు.
CBI Joint Director: సీబీఐ జేడీకి 3 నెలల జైలుశిక్ష, న్యాయస్థానం సంచలన తీర్పు!
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..!