క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ఎంతోమంది పలు విధాలుగా నష్టపోయారు. అయితే తాజాగా ఆ యుద్ధం కారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా పశ్చిమాష్య లో యుద్ధం అరటి రైతులకు ఆవేదన మిగిల్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పై రాష్ట్రాలు అలాగే దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో ధరలు రోజురోజుకు భారీగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లో ప్రతి ఏటా లక్ష టన్నులకు పైగా అరటి పండ్లు ఎగుమతి అవుతుండగా తాజాగా యుద్ధం వల్ల సరఫరా అనేది పూర్తిగా ఆగిపోయింది. దీంతో గతంలోని ధరల కన్నా ఇప్పుడు ధరలు రైతులకు మరింత బాధను కలిగిస్తున్నాయి. యుద్ధానికి ముందు అరటి పండ్లు టన్ను 20వేల నుంచి 23 వేల పలుకగా ప్రస్తుతం 6000 నుంచి 8 వేల రూపాయల మధ్య మాత్రమే పలుకుతుంది. మరోవైపు నాణ్యతను బట్టి టన్నుకు 4000 నుంచి 5000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని రైతులు ఆవేదన చెందుతున్నారు. పండించిన పంటకు పెట్టుబడి కూడా రావట్లేదు అని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వెంటనే ప్రభుత్వాలు స్పందించి అరటి రైతన్నలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించాలి అని కోరుతున్నారు. కాగా ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు మరియు ఉల్లిగడ్డల ధరలు కూడా భారీగా పడిపోయిన విషయం తెలిసిందే.
కొరియన్ కనకరాజు కోసం స్పెషల్ సాంగ్… సినిమాలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ…!
కాల్పుల ఘటనను ఖండించిన మోదీ…! ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదంటూ ట్వీట్…