Homeతెలంగాణకాంగ్రెస్ "దగా" పై ధ్వజమెత్తిన బీఆర్ఎస్

కాంగ్రెస్ “దగా” పై ధ్వజమెత్తిన బీఆర్ఎస్

•ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలి : గ్రామశాఖ అధ్యక్షులు ఆకుల శివ

క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి:-తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ పార్టీ సూరారం గ్రామశాఖ అధ్యక్షులు ఆకుల శివ అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆకుల శివ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, రెండున్నరేళ్లు కావస్తున్నా పూర్తిగా అమలు చేయడం లేదని, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఎలాంటి చట్టపరమైన రక్షణ కల్పించలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ మాట్లాడుతూ బడ్జెట్‌లో పథకాలకు నిధులు కేటాయించినా, ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ‘అభయహస్తం’ కాస్తా ‘రిక్త హస్తం’ (ఖాళీ చేయి) అయ్యిందని, మహిళలకు నెలకు రూ.2,500, యువతకు నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదని, 2 లక్షల ఉద్యోగాల హామీ గాలిలో కలిసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రత్న లచ్చిరెడ్డి, యువ నాయకులు దేవులపల్లి కేశవ్, పంతంగి సాయి, మరియూ తదితరులు పాల్గొన్నారు.

CM Yogi: లోక్‌సభలో మహిళా బిల్లు ఫెయిల్… యోగి షాకింగ్ కామెంట్స్!

Ashwagandha Leaves: బలం కోసం వాడే అశ్వగంధపై నిషేధం.. కేంద్రం నిర్ణయం వెనుక కారణం ఏంటి?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు